TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 10 – 2024

BIKKI NEWS (OCT. 02) : TODAY NEWS IN TELUGU on 2nd OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 2nd OCTOBER 2024

TELANGANA NEWS

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు’ అందజేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్‌ తలపెట్టిన కూల్చివేతలపై బాధితుల పక్షాన కోర్టుకెళ్తానని పీసీసీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఫుడ్స్‌లో వినియోగిస్తున్న ముడిసరుకు ధరల సవరణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక ప్రకటించారు.

రజాకార్లు, సీమాంధ్రులతో పోరాడినట్టే, మూసీ వ్యతిరేకులతో నల్లగొండ ప్రజలు పోరాడాల్సి వస్తదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాన్వాయ్‌ని వెంబడించి మరీ దారికాచి అటకాయించి వీరంగం సృష్టించారు.

హైదరాబాద్‌లో డీజేలు, ఫైర్‌క్రాకర్స్‌పై పోలీసులు నిషేధం విధించారు. శబ్దకాలుష్యానికి కారణం అవుతున్నందున వాటిని నిషేధిస్తూ హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

సైదాబాద్‌ మండలం మూసీ పరివాహక ప్రాంతంలో 150 ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు.

తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

నేటి నుంచి ద‌స‌రా సెల‌వులు.. పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

ANDHRA PRADESH NEWS

భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల వల్ల స్వామివారి హుండీకి రూ. 5.05 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి.

ఏపీ ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది

సుప్రీం కోర్టు ఆదేశాలతో సిట్‌ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేత : ఏపీ డీజీపీ

రతనాల సీమగా ఉన్న రాయలసీమ ను గ్రీన్‌ ఎనర్జీ హబ్‌ గా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ప్రాయశ్చిత్త దీక్షపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసమే కాదని తెలిపారు.

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తులు షురూ.. ఈనెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ !.. కదా?.. ఇక చాలు.. ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్

NATIONAL NEWS

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్లు మళ్లీ సమ్మెకు దిగారు. మంగళవారం నుంచి నిరవధికంగా, పూర్తిగా విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

తల్లిని చంపేసి, శరీర భాగాలను తినేసిన వ్యక్తికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది. దోషి సునీల్‌ కుచ్‌కోరవి 2017 ఆగస్ట్‌ 28న కొల్హాపూర్‌లోని తన ఇంట్లో తన తల్లి యల్లమ రమ కుచ్‌కొరవిని కిరాతకంగా హత్య చేశాడు.

బుల్డోజర్‌ కూల్చివేతలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది. ఏదో ఓ మతానికి కాకుండా ప్రజలందరికీ వర్తించే విధంగా ఈ మార్గదర్శకాలు ఉంటాయని తెలిపింది.

వంటగ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.48.5 పెరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది.

ఎవరెస్టు కింది భాగంలో నదుల ప్రవాహం పెరుగుతూ ఎవరెస్టు ఎత్తు వేగంగా పెరగడానికి కారణం అవుతున్నట్టు తేలింది.

ఈ ఏడాది రుతుపవన సీజన్‌లో 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, పశ్చిమ మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్రలో అధిక వర్షాలు కురిశాయని వెల్లడించింది.

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

కర్ణాటక ముడా స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలను ముడా అధికారులు వెనక్కి తీసుకున్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు లభించింది.

మ‌హిళ‌ల్ని ఎందుకు స‌న్యాసినులుగా మారుస్తున్నారు.. స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్‌ను ప్ర‌శ్నించిన మ‌ద్రాస్ హైకోర్టు

INTERNATIONAL NEWS

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్‌ కూడా ప్రత్యక్షంగా దిగింది. మంగళవారం సుమారు 500 క్షిపణులు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది.

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న స్కూల్‌ బస్సు.. 25 మంది మృతి

ఎడాపెడా దాడులతో ఇజ్రాయెల్‌ ఊపిరి సలపనీయకుండా చేస్తున్నప్పటికీ లెబనాన్‌ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా మాత్రం తాము వెనక్కి తగ్గేదే లేదని నయీమ్‌ కాసీమ్‌ స్పష్టం చేస్తున్నది

BUSINESS NEWS

సెన్సెక్స్ : 84,266 (-33)
నిఫ్టీ : 25,797 (-14)

టాటా గ్రూప్‌లోని రెండు ఎయిర్‌లైన్స్‌ విలీనం.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో కలిసిన ఏఐఎక్స్‌ కనెక్ట్‌

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా-2025 సదస్సు లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో ఆవిషరించారు

సెప్టెంబర్ 2024 కు గానూ జీఎస్టీ రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.200 తగ్గి రూ.78,100లకు చేరుకున్నది.

SPORTS NEWS

కాన్పూర్‌ టెస్టులో భారత్ సంచలన విజయం. 2-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.

టెన్నిస్‌ యువ సంచలనాలు జన్నిక్‌ సిన్నర్‌ (ఇటలీ), కార్లొస్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌) చైనా ఓపెన్‌ టెన్నిస్‌ ఫైనల్‌లో ముఖాముఖి తలపడనున్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భారత్‌ ఇప్పటికే వెస్టిండీస్‌పై విజయం సాధించిన టీమ్‌ఇండియా..మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మరో వామప్‌లో28 పరుగుల తేడాతో గెలిచింది

ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్ 11 సార్లు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డుతో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. తాజాగా అశ్విన్ కూడా 11 సార్లు ఈ అవార్డు సొంతం చేసుకుని రికార్డు సమం చేశాడు.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ లో నేటి నుంచి, ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి దసరా సెలవులు

ఏపీలో వరదల కారణంగా సర్టిఫికెట్ లు కోల్పోయిన వారు ఉచితంగా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లు పొందవచ్చు అని బోర్డు ప్రకటించింది.

ENTERTAINMENT UPDATES

ప్రమాదవశాత్తు తుపాకీ పేలిన ఘటనలో బాలీవుడ్‌ నటుడు గోవిందా తీవ్రంగా గాయపడ్డారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు