BIKKI NEWS (SEP. 29) : TODAY NEWS IN TELUGU on 29th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 29th SEPTEMBER 2024
TELANGANA NEWS
మూసీ సుందరీకరణ పేరుతో అందులో గోదావరి నీళ్లు పారిస్తామని అంటున్నారని, కానీ అందులో పారేది పేద, మధ్య తరగతి ప్రజల రక్తమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు
హైడ్రా భయాందోళనతో ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు నెలల క్రితం డ్రోన్ సర్వే చేయగా మూసీ నది బఫర్‌జోన్‌లో 10,660 నివాసాలున్నట్టు గుర్తించాం.. వీళ్లందర్నీ 14 ప్రాంతాలకు తరలించి పునరావసం కల్పిస్తున్నాం.- మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్
పేదవాళ్లను, చిన్న వాళ్ల ను బాధపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదు.. హైడ్రా ను బూచిగా చూపుతున్నారు.. హైడ్రా ఒక భరోసా, బాధ్యత’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
పొంగులేటి ఇండ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులకు సంబంధించి కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. మొత్తం 12 వాచీలు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించిందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఒక్కొక్కటి రూ.7 కోట్లు చొప్పున వీటి విలువ రూ.84 కోట్లు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వివిధ సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన రూ.26.2 కోట్లను బాధితుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు సీఎస్‌బీ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు.
సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ 200 గ్రాముల బంగారాన్ని జరీ పోగులుగా తయారు చేసి 12 రోజుల వ్యవధిలో చీరను రూపొందించాడు.
ANDHRA PRADESH NEWS
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.
లడ్డూ కల్తీ వ్యవహారంపై ధైర్యముంటే సీబీఐకు లేఖ రాయాలి : మాజీ మంత్రి బొత్స
విశాఖ స్టీల్ పరిరక్షణకు సెయిల్‌తో చర్చలు నిజమే : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
డిప్యూటీ సీఎం అయ్యింది దీక్షలు చేయడానికా?.. పవన్ కల్యాణ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్
NATIONAL NEWS
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా సహా కర్ణాటక బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా శనివారం బెంగళూరులోని తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది
సీబీఎస్‌ఈ నిర్వహించే పదో తరగతి, పన్నెండో తరగతి బోర్డ్ పరీక్షలు సీసీటీవీ నిఘాలో జరగబోతున్నాయి.
తమిళనాడు సీఎం స్టాలిన్ తన మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేశారు. తన కుమారుడు, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉపముఖ్యమంత్రిగా నియమించారు.
ఎగుమతుల సుంకం నుంచి బాస్మతియేతర తెల్ల బియ్యానికి మినహాయింపు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా రెస్క్యూ మిషన్
పాకిస్థాన్ హింసపై మాట్లాడడం కపటత్వమే.. షాబాజ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భారత్ దౌత్యవేత భవికా
కేరళలో మరో వ్యక్తికి మంకీపాక్స్.. అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న వారు రైతులు కాదు: మనోహర్ లాల్ ఖట్టర్
INTERNATIONAL NEWS
అత్యంత శక్తిమంతమైన క్యాటగిరీ-4 హరికేన్ ‘హెలెనా’ అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నది. తుఫాను కారణంగా సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, వర్జినీయా రాష్ర్టాల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నేపాల్ వరదలు.. 60కి చేరిన మృతుల సంఖ్య
‘ఇజ్రాయెల్‌పై పోరాటాన్ని కొనసాగిస్తాం’.. నస్రల్లా మరణాన్ని ధృవీకరించిన హిజ్బుల్లా
BUSINESS NEWS
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ విలీనానికి ఇరు సంస్థల బోర్డులు ఆమోదం తెలిపాయి. ఈ విలీనం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నది.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను అమూల్ రూ.59,445 కోట్ల(7 బిలియన్ డాలర్లు) ఆదాయాన్ని ఆర్జించింది.
ముడి చమురు బ్యారెల్‌కు 84 డాలర్ల నుంచి 72 డాలర్ల దిగువకు చేరింది. వాస్తవానికి కంపెనీలు ధరలను తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు చాలా అవకాశం ఉన్నది.
SPORTS NEWS
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టును రెండో రోజు ఆట పూర్తిగా వర్షం కారణంగా రద్దు అయింది.
ఐపీఎల్ లో లీగ్‌లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5లక్షలు, మొత్తం మ్యాచ్‌లు ఆడితే 1.05 కోట్లు దక్కుతాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. అదనంగా ఒక్కో ఫ్రాంచైజీ 12.60 కోట్లు మ్యాచ్ ఫీజుగా కేటాయించనున్నారు..
మకావు ఓపెన్ సూపర్-300 టోర్నీలో భారత యువ ద్వయం గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీకి కాంస్య పతకం దక్కింది.
ఐపీఎల్ గవర్నింగ్ మండలి ప్రతి ఫ్రాంచైజీకి ఐదుగురిని అట్టిపెట్టుకునే అవకాశం కల్పించింది.
EDUCATION & JOBS UPDATES
మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలలో 96 కాంట్రాక్టు ఉద్యోగాలు
నీట్ స్థానికత కేసు పై సెప్టెంబర్ 30న మరింత స్పష్టత ఇస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది.
తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ పై హైకోర్ట్ లో పిటిషన్లపై సెప్టెంబర్ 30న విచాఈ
ENTERTAINMENT UPDATES
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా)-2024 వేడుక అబుదాబిలో వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వివిధ భాషలకు చెందిన అగ్ర తారలు సందడి చేశారు.
దేవర వరల్డ్ వైడ్‌గా తొలి రోజే రూ. 172 కోట్ల కలెక్షన్లు రాబట్టింది