Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 28 – 09 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 28 – 09 – 2024

BIKKI NEWS (SEP. 28) : TODAY NEWS IN TELUGU on 28th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 28th SEPTEMBER 2024

TELANGANA NEWS

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం

హైద‌రాబాద్‌లో మ‌రో కొత్త హెచ్‌సీఎల్ క్యాంప‌స్.. 5 వేల మంది ఇంజినీర్ల‌కు ఉద్యోగాలు.

సమస్యను వెంటనే పరిష్కరించాలని జీవో 46 బాధితులు శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను ముట్టడించారు.

రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లతోపాటు పలు కంపెనీలపై అనేక ఆరోపణలున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఐటీ, కస్టమ్స్‌ వంటి దర్యాప్తు సంస్థలు గతంలో సోదాలు నిర్వహించగా తాజాగా ఈడీ రంగ ప్రవేశం చేయడం కలకలం రేపుతున్నది.

ఉప ముఖ్యమంత్రి భట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చితే హైదరాబాద్‌ అగ్నిగుండంగా మారుతుందని బీఆర్‌ఎస్‌ నాయకుడు పీ కార్త్తీక్‌రెడ్డి హెచ్చరించారు

పాఠశాలల సమీపంలో జంక్‌ఫుడ్‌, మత్తుపదార్థాల విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జంక్‌ఫుడ్స్‌ విక్రయాలు జరుపొద్దని, డ్రగ్స్‌, ఆల్కహాల్‌, పొగాకు అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది.

ఉత్తమ పర్యాటక గ్రామాలుగా సోమశిల, నిర్మల్‌ ఎంపికయ్యాయి. 2024 సంవత్సరానికి కేంద్ర పర్యాటకశాఖ ఉత్తమ పర్యాటక గ్రామాలను శుక్రవారం ప్రకటించింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాష్ర్టానికి రానున్నారు. ఉదయం నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు.

గ్రూప్‌-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022 నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్‌ జారీపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ కార్తీక్‌ శుక్రవారం విచారణ ప్రారంభించారు.

నీట్‌ కౌన్సెలింగ్‌లో స్థానికతకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది

ఇల్లు ఎఫ్టీఎల్‌లో ఉన్నదని హైడ్రా వార్నింగ్‌.. కూల్చేస్తారనే భయంతో ఉరేసుకున్న మహిళ

చారిత్రాత్మ‌క భ‌వ‌నాల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం : సీఎం రేవంత్ రెడ్డి

ANDHRA PRADESH NEWS

నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి : వైఎస్‌ జగన్‌. తిరుమల పర్యటనను మతం పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు

తిరుమల పవిత్రతను కాపాడేందుకు అన్యమతస్థులు ఎవరైనా స్వామివారి దర్శనం కోసం వస్తే నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు.

తనకు ఓటు వేయని ఎస్సీలకు ఏ మంచి చేయవద్దని ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుమలలో ఎప్పటినుంచో డిక్లరేషన్‌ ఉంది.. ఎవరైనా పాటించాల్సిందే : జగన్‌కు చంద్రబాబు కౌంటర్‌

టీటీడీ మరో సంచలన నిర్ణయం.. హిందూయేతరుల కోసం బోర్డుల ఏర్పాటు..వెంటనే ఒకటి మినహా అన్నీ తొలగింపు

వైజాగ్‌ స్టీల్‌ను మరో ప్రభుత్వరంగ సంస్థయైన సెయిల్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

NATIONAL NEWS

దేశంలో 15-34 ఏండ్ల మధ్య వయసు ఉండి, పనిచేయగల సామర్థ్యమున్న యువతలో దాదాపు పాతిక శాతం మంది ఏ పనీలేకుండా రోడ్ల మీద తిరుగుతున్నట్టు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) తాజా నివేదికలో వెల్లడించింది.

ముడా స్కామ్‌లో కర్ణాటక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు శుక్రవారం మైసూరులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

బ్రహ్మోస్‌ సూపర్‌సానిక్‌ క్రూయిజ్‌ మిసైల్స్‌ను తయారు చేసే బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ అగ్నివీరులకు సాంకేతిక, పరిపాలన, భద్రతా విభాగాల్లో రిజర్వుషన్లు కల్పించాలని నిర్ణయించింది.

కేరళలో మరో ఎంపాక్స్‌ కేసు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు చికిత్స చేయించుకోవాలని కోరింది.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల విదేశీ మిత్రులను భారత దేశ పర్యాటక రంగంవైపు ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత వీసాల పథకాన్ని అమలు చేయబోతున్నది.

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేది ఎన్డీఏ ప్రభుత్వమే : బీజేపీ చీఫ్‌ నడ్డా

ఆయన ధైర్యవంతుడైన నిజాయితీ గల రాజకీయ నాయకుడు.. రాహుల్‌పై సైఫ్‌ అలీఖాన్‌ ప్రశంసలు

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకై యూకే మద్దతు

మోదీకి బదులు.. నాకు చాలాసార్లు ప్రధాని పదవి ఆఫర్‌ వచ్చింది : నితిన్‌ గడ్కరీ

INTERNATIONAL NEWS

లెబనాన్‌ సరిహద్దుకు యుద్ధట్యాంకులు.. భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సిద్ధం

ఐవీఎఫ్‌ పిల్లలకు గుండె సమస్యలు.. కవలలుగా పుట్టిన వారిలో మరింత ఎక్కువ

ఫిలిప్పిన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇర్రి)కు చెందిన శాస్త్రవేత్తలు ఇర్రి 147, ఇర్రి 125 అనే రెండు కొత్త వరి రకాలను అభివృద్ధి చేశారు.

జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా వారసుడిగా ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రి షిగెరు ఇషిబా (67) ఎన్నికయ్యారు.

వుహాన్‌ సమీపంలో చైనా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అణు జలాంతర్గామి నిర్మాణంలో ఉండగానే నీట మునిగిందని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు.

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతిని అంతం పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ముందడుగు వేశారు. ఈ మేరకు హింసకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

BUSINESS NEWS

స్టాక్‌ మార్కెట్ల ర్యాలీకి బ్రేక్‌
సెన్సెక్స్ : 85,572 (- 264)
నిఫ్టీ : 26,179 (- 37)

క్యాష్‌ మార్కెట్‌, ఈక్విటీ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ సెగ్మెంట్లలో లావాదేవీ ఫీజులను బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లు శుక్రవారం సవరిస్తున్నట్టు ప్రకటించాయి.

వరుసగా మూడో రోజు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.50 పెరిగింది. తద్వారా బంగారం ధర రూ.78,300లకు చేరుకున్నదని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది.

SPORTS NEWS

భారత్ – బంగ్లాదేశ్ రెండో టెస్ట్ వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌.. 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్‌ హక్‌ (40 బ్యాటింగ్‌, 7 ఫోర్లు), ముష్ఫీకర్‌ రహీమ్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ (2/34) రాణించాడు.

వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌, దిగ్గజ ఆటగాడు డ్వేన్‌ బ్రావో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు వచ్చే ఎడిషన్‌ నుంచి మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.

భారత స్టార్‌ షట్లర్‌ ద్వయం పుల్లెల గాయత్రి, త్రిసా జాలీ జోడీ మకావు ఓపెన్‌ సూపర్‌- 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన అర్జున్‌, హారికకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షల చొప్పున నగదు ప్రోత్సాహం ప్రకటించింది.

ఆసియా దేశాల్లో (భార‌త్, శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్‌)లో ఎక్కువ వికెట్లు(420) ప‌డ‌గొట్టిన భార‌త బౌల‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు. దాంతో, 419 వికెట్లు తీసిన కుంబ్లే రెండో స్థానానికి ప‌డిపోయాడు

EDUCATION & JOBS UPDATES

IBPS 9923 క్లర్క్ జాబ్స్ ఫలితాలు విడుదల

గేట్ – 2025 దరఖాస్తు గడువు అక్టోబర్ 03 వరకు పెంపు

కొండా లక్ష్మణ్ హర్టీకల్చర్ యూనివర్సిటీ లో పీజీ, పీహెచ్డీ అడ్మిషన్స్

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ గడువు అక్టోబర్ 15వరకు 500/- ఆలస్య రుసుముతో పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రొగ్రెస్ కార్డులు అందజేయనున్నట్లు బోర్డు ప్రకటన.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2024-25విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులలో అక్టోబర్‌ 3,4న ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ శుక్రవారం ప్రకటించారు.

తెలంగాణ రెండేండ్ల బీఈడీ కోర్సులో మరో 6,928 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఆయా సీట్లు నిండాయి. కౌన్సెలింగ్‌కు 11,087 మంది హాజరుకాగా, 9,616 సీట్లకు 6,928 సీట్లు నిండాయి.

ENTERTAINMENT UPDATES

12th ఫెయిల్ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కేసుల విచారణకు వేదికగా ఉన్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ చిత్రాన్ని తాజాగా ప్రదర్శించారు.

అకాడమీ అవార్డు విజేత‌, హ్యారీ పోటర్ సినిమా ఫేం ప్ర‌ముఖ బ్రిటిష్ నటి మ్యాగీ స్మిత్ కన్నుమూశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు