BIKKI NEWS (SEP. 26) : TODAY NEWS IN TELUGU on 26th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 26th SEPTEMBER 2024
TELANGANA NEWS
జీవో-317 ప్రభావిత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ అంశంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. నివేదికను రూపొందించి, మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరికి పంపినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి.
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధివిధినాలను ఒకట్రెండు రోజుల్లో రూపొందించాలని సూచించారు.
రాబోయే రెండురోజులు భారీ వానలే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
పార్టీ ఫిరాయింపులు జరిగిన పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరాబర్ ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పునరుద్ఘాటించారు.
రైతులను, పేదలను కంటతడి పెట్టించడమే కాంగ్రెస్ మార్క్ మార్పు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్లు, రైతుల ఇండ్లపైకి బ్యాంకు అధికారులు.. ఇదేనా? ‘మార్పు’? అని ప్రశ్నించారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచంలో ఎంబీఏ కోర్సులు అందించే అత్యుత్తమ 100 సంస్థల్లో ఐఎస్‌బీకి స్థానం లభించింది
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మొదటి భారతీయ కళా మహోత్సవం నిర్వహించనున్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వశాఖల సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు.
బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య, వాటి తీవ్రత పెరుగుతున్నది. దీంతో తుపాన్లుగా మారి కుంభవృష్టి కురిపించడాన్ని వాతావరణ నిపుణులు అసాధారణమైనదిగా విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్ విపత్తు నిర్వహణ-ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు 169 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేటాయించింది
ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాము 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని, రెండుమూడు రోజుల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనున్న ట్టు చెప్పారు
ANDHRA PRADESH NEWS
ఏపీ మాజీ సీఎం జగన్ ఈ నెల 28న కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన బాబు ప్రభుత్వం.
తెలుగు రాష్ట్రాల బీసీలకు ఆర్ కృష్ణయ్య మోసం : మాజీ మంత్రి కారుమూరి.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న పాఠశాల అదనపు సజ్జ కూలి విద్యార్థి మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు
నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ కి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
ఒంగోలు మాజీ ఎంపీ, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ (78) అనారోగ్యంతో కన్నుమూశారు
NATIONAL NEWS
ముడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ముడా కేసులో విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
న్యాయాన్ని నిర్ణయించి చెప్పేవారి హృదయం, ఆత్మ నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.
తన దురుసు వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతులకు క్షమాపణ చెప్పారు.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 56.05% ఓటింగ్ నమోదు.
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు.. పార్లమెంటులో పోరాడతాం: రాహుల్ గాంధీ
కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉన్న నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు.
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సబర్‌కాంతా జిల్లాలోని హిమ్మత్ నగర్ వద్ద కారు – లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
INTERNATIONAL NEWS
అరిజోనాలో అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు.
విమానాల నుంచి వెలువడే పొగ మేఘాలు ఆకాశంలో దుప్పటి మాదిరిగా పని చేస్తాయని, ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు హెచ్చరించారు
చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ హ కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకండ్లు తగ్గిందని నాసా సైంటిస్టులు గుర్తించారు.
కమర్షియల్ రాకెట్ లిజియన్-1ను చైనా ప్రయోగించింది. ఆ రాకెట్ ద్వారా అయిదు ఉపగ్రహాలను తీసుకెళ్లారు.
ఖండాంతర క్షిపణిని చైనా పరీక్షించింది. ఐసీబీఎంను పసిఫిక్ సముద్రంలో పరీక్షించినట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పేర్కొన్నది.
ఇజ్రాయిల్ ఫైటర్ జెట్లు చేసిన అటాక్‌లో హిజ్‌బొల్లా మిస్సైల్ యూనిట్ కమాండర్ ఇబ్రహీం ఖుబాయిసి మృతిచెందాడు
BUSINESS NEWS
సెన్సెక్స్ : 85,170 (256)
నిఫ్టీ : 26,004 (64)
లక్ష కోట్ల రూపాయల లాభాన్ని సాధించిన తొలి భారతీయ ఆర్థిక సంస్థగా ఎదగాలన్నదే ఎస్బీఐ లక్ష్యమని, ఆ దిశగా వెళ్తున్నామని ఆ బ్యాంక్ నూతన చైర్మన్ సీఎస్ శెట్టి పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీవోకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 30న స్విగ్గీ..సెబీకి దరఖాస్తు చేసుకోగా, ఐదు నెలల తర్వాత నియంత్రణ మండలి అనుమతినిచ్చింది
బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. బుధవారం మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు దేశ రాజధాని నగరం ఢిల్లీలో రూ.77,850 పలికింది. మంగళవా రం ముగింపుతో చూస్తే ఒక్కరోజే రూ.900 ఎగిసింది
SPORTS NEWS
ప్రతిష్ఠాత్మక ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత వెటరన్ క్యూయిస్టు కమల్ చావ్లా విజేతగా నిలిచాడు.
ప్రతిష్టాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణాలు గెలిచిన భారత బృందానికి ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) రూ.3.2 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.
గుజరాత్ యువ క్రికెటర్ ద్రోణ దేశాయ్ ఒక ఇన్నింగ్స్‌లో 498 పరుగులు చేసి రికార్డులు బద్దలుకొట్టాడు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక మౌంట్ గోరిచెన్ శిఖరాన్ని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యాతండాకు చెందిన యశ్వంత్ అధిరోహించాడు
EDUCATION & JOBS UPDATES
ఇంజినీరింగ్ ఫస్టియర్ అడ్మిషన్లను అక్టోబర్ 23లోపు పూర్తిచేసుకోవచ్చని అఖిల భారత సాంకేతిక విద్యామండలి స్పష్టంచేసింది. మిగులు సీట్లను ఆయా తేదీల్లోపు భర్తీచేసుకునే అవకాశమిచ్చింది.
తెలంగాణ లో ఐటిఐ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 28 వరకు అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీలలో 604 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్
తెలంగాణ లో 633 ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్
త్వరలోనే 35 వేల పోస్టుల భర్తీ – రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డీఆర్‌డీవో లో 200 ఖాళీలు
ENTERTAINMENT UPDATES
బాలు నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. చెన్నై నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ పేరు పెడుతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
త్వరలోనే సూర్య, విక్రమ్, శంకర్ ల కాంబో లో సినిమా