Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 05- 2025

BIKKI NEWS (MAY 25) : TODAY NEWS IN TELUGU on 25th MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 25th MAY 2025

TELANGANA NEWS

తెలంగాణకు చేయూతనివ్వాలని నీతి ఆయోగ్ సమావేశంలో కోరిన సీఎం రేవంత్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి మెట్రోకు సహాయం అందించాలని కోరారు

కొవిడ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు సూచించారు

జూన్ 2 నుండి అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్‌ పరీక్ష ఆదివారం జరగనున్నది.

బీసీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్ల జాబితా విడుదల

ANDHRA PRADESH NEWS

రాష్ట్ర అభివృద్ధికి చతుర్ముఖ వ్యూహంతో పని చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ప్రభుత్వం అంటే మీకు కృతజ్ఞతలు లేదా అని సినీ పెద్దలను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కరోనా కేసు నమోదయింది

NATIONAL NEWS

ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్‌ భేటీ

ఉగ్రవాదుల కోసం నేపాల్‌ సరిహద్దులో గాలింపు చేపట్టిన సైన్యం

పన్ను రాబడిలో రాష్ర్టాలకు 50% వాటా ఇవ్వాలి – తమిళనాడు సీఎం

కొవిడ్‌ కొత్త రూపాంతరాలు (వేరియంట్లు) ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సాకోగ్‌) శనివారం తెలిపింది.

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత తొలిసారి మే మాసంలో నైరుతి రుతుపవనాల రాక.

మహిళల హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకం: సుప్రీంకోర్ట్‌

INTERNATIONAL NEWS

మయన్మార్‌ తీర ప్రాంతంలో ఓడలు మునిగి సుమారు 427 మంది ప్రాణాలు కోల్పోయారు.

నన్ను వేశ్యగా చూస్తున్నారు.. అందాల పోటీల నుంచి తప్పుకున్న ఇంగ్లండ్‌ భామ

ఉగ్రదాడుల్లో 20,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.. యూఎన్‌లో పాక్‌పై విరుచుకుపడిన భారత్‌

BUSINESS NEWS

24 గంటల్లో 5.88 లక్షల పాలసీల విక్రయంతో గిన్నిస్ రికార్డులలోకి ఎక్కిన ఎల్ఐసీ

పీఎఫ్‌ ఖాతాలో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25శాతం వద్ద కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.

SPORTS NEWS

IPL – ఉత్కంఠ పోరులో పంజాబ్ పై డిల్లీ విజయం

భారత టెస్టు కెప్టెన్ గా శుభమన్ గిల్, వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ లను ప్రకటించిన బీసీసీఐ

ఇంగ్లండ్‌ పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్‌ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు

EDUCATION & JOBS UPDATES

TG POLYCET RESULTS విడుదల

CIVILS – నేడు సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష

ECET RESULTS – నేడు ఈసెట్ ఫలితాలు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు