Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025

BIKKI NEWS (APRIL 24) : TODAY NEWS IN TELUGU on 24th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 24th APRIL 2025

TELANGANA NEWS

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుండి ప్రారంభం కానున్నాయి. ఫీజు గడువు ఏప్రిల్ 30 వరకు కలదు.

65 సంవత్సరాలు దాటితే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు ఇవ్వకూడదని ప్రాథమికంగా నిర్ణయం.

ధరణి కష్టాలు తొలగించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చామని పొంగులేటి తెలిపారు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ హైదరాబాద్ లో ప్రశాంతంగా ముగిసింది

ఏప్రిల్ 27న చరిత్రలో నిలిచేలా బీఆర్ఎస్ రజితోత్సవ సభ నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు

రాష్ట్రంలో వడదెబ్బకు బుధవారం 8 మంది మృతి చెందారు

ఏప్రిల్ 25 26వ తేదీలలో హైదరాబాదులో భారత్ సమ్మిట్ పేరుతో ప్రభుత్వం అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుంది.

త్వరలోనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తాం – మంత్రి సీతక్క వెల్లడి

20 సంవత్సరాలుగా రోజువారి వేతన ప్రాతిపదికన స్వీపర్లుగా, క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్న 456 మంది తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు హైకోర్టు ఆదేశం.

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల.

పదో తరగతి లో 81.14% మంది ఉత్తీర్ణత సాధించారు.

పోలవరం ఎత్తు 135 అడుగులకు తగ్గింపు. కేంద్ర క్యాబినెట్ లో నిర్ణయం.

అమరావతిలో లక్ష కోట్ల రూపాయలతో మొదలుపెట్టనున్న పనులకు మే 2న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని మంత్రి నారాయణ తెలిపారు

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను మే 19వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం కలదు

NATIONAL NEWS

పహెల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం. సింధు జలాల ఒప్పందం రద్దు, అటారి సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ పౌరులకు భారత్ లోకి నో ఎంట్రీ, దౌత్యధికారుల ఉపసంహరణ వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు గట్టిగా బదులిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజు నాధ్ సింగ్ తెలిపారు

ఉగ్ర దాడిలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల ఎక్బ్‌గ్రేషియా ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం

ఉగ్ర దాడిలో పాల్గొన్న మొత్తం ఉగ్రవాదుల సంఖ్య ఏడుగా గుర్తించారు. వారిలో ముగ్గురి ఊహ చిత్రాలను విడుదల చేశారు.

తాజ్ మహల్ సందర్శించిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్

INTERNATIONAL NEWS

భారత్లో ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అంటూ వ్యాఖ్యానించిన ట్రంప్ ఫోన్ కాల్ లో ప్రధానితో మాట్లాడారు.

ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినతరం చేసింది.

న్యూ జెర్సీలో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుంది

BUSINESS NEWS

80 వేల మార్కును దాటిన సెన్సెక్స్

సెన్సెక్స్ : 80,116 (521)
నిఫ్టీ : 24,329 (162)

IPO – ఏథర్ ఎనర్జీ ఐపీవో, ఏప్రిల్ 28 – 30 లలో ఐపీఓ కు రానున్న ఏథర్ ఎనర్జీ. ధర 304 నుండి 321 మధ్య ఉండవచ్చు

బుధవారం బంగారం ధర 3,400 నష్టపోయి 98,700కు చేరింది

SPORTS NEWS

IPL 2025 – హైదరాబాద్ పై ముంబై ఘనవిజయం.

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ మరియు బెంగళూరు తలపడనున్నాయి

అంతర్జాతీయ మహిళల గ్రాండ్ ఫ్రీ చెస్ సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్ లో విజేతగా కోనేరు హంపి నిలిచింది.

EDUCATION & JOBS UPDATES

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.

మే 19 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు