BIKKI NEWS (APRIL 22) : TODAY NEWS IN TELUGU on 22nd APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 22nd APRIL 2025
TELANGANA NEWS
ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్ ఫో పాల్గొన్న తెలంగాణ సీఎం బృందం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరిన సీఎం.
నేడు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు
డిగ్రీలో బకెట్ సిస్టంను ఎత్తివేయాలని చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది
లగచర్ల రైతులపై రెండు ఎఫ్ఐఆర్ లు కొట్టివేత
నాలుగు ఎకరాలకు పైన ఉన్నవారికి త్వరలో రైతు భరోసా అందజేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు
నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో పూడిక తీయిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు
వేసవిలో ప్రభుత్వ టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యాశాఖ
బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల
ANDHRA PRADESH NEWS
పోలీసులు చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోమని ఏపీ హైకోర్టు ఆదేశించింది
నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు భేటీ కానున్నారు
అనకాపల్లిలో హెల్త్ సిటీ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు
ఏప్రిల్ 23న ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల
త్వరలో 800 కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
NATIONAL NEWS
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం సమావేశమయ్యారు.
భారత్‌లో ఎన్నికల సంఘం రాజీ పడిందని అమెరికా లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకరపోరులో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
పిల్లల అక్రమ రవాణా చేసేవాళ్లు హంతకుల కంటే ప్రమాదకరం.. సుప్రీంకోర్టు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో PSLV-C60/SpaDeX మిషన్‌లో భాగంగా రెండో సారి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.
INTERNATIONAL NEWS
POPE FRANCIS – క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. 2013లో 266వ పోప్‌గా బాధ్యతలు.
సుంకాలతో సంబంధం లేకుండా ఇతర రూపాలలో అమెరికాను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే తమ మధ్య సంబంధాలు దెబ్బతినగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
BUSINESS NEWS
STOCK MARKET : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు
సెన్సెక్స్ : 79408.50 (855.30)
నిఫ్టీ : 24,125.56 (273.90)
తులం బంగారం లక్ష రూపాయలకు ఈ వారం దాటే అవకాశం ఉంది.
భారతదేశంలో టెలికం యూజర్ల సంఖ్య 119 కోట్లకు చేరింది
SPORTS NEWS
IPL 2025 : కోల్‌కతా పై గుజరాత్ టైటాన్స్ గెలుపు.
ISSF షూటింగ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ సిమ్రన్‌ప్రీత్ కౌర్ రజత పతకంతో మెరిసింది.
34 మందితో కూడిన కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది.
EDUCATION & JOBS UPDATES
INTER RESULTS – నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025 ఫలితాలు విడుదల.
POSTAL GDS RESULTS – పోస్టల్ వీడియోస్ జనవరి 2025 సెషన్ నోటిఫికేషన్ కు సంబంధించి రెండో మెరిట్ జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.
- ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతం ప్రవేశపెట్టే ఆలోచన లేదు – బోర్డు ప్రకటన
- AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష
- TG 10th Result – నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025
- MALARIA DAY – ప్రపంచ మలేరియా దినోత్సవం