Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 04 – 2025

BIKKI NEWS (APRIL 19) : TODAY NEWS IN TELUGU on 19 APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 19 APRIL 2025

TELANGANA NEWS

హైదరాబాదులో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు జపాన్ సంస్థలతో ఒప్పందం చేసుకున్న సీఎం

రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి.

TG EAPCET 2025 – నేడు అగ్రికల్చర్‌, ఫార్మసీ హాల్‌టికెట్ల విడుదల. 22న అందుబాటులోకి ఇంజినీరింగ్‌ హాల్‌టికెట్లు

ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా చేపట్టిన స్కూల్ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు

ANDHRA PRADESH NEWS

జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే నెంబర్ 2 స్థానం నుంచి 2000 స్థానానికి పడిపోయానంటూ విజయ సాయి రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు

తుంగభద్ర డ్యామ్ గేట్లని మార్చాల్సిందేనట్టు నిపుణులు తెలిపారు

బెట్టింగ్ యాప్ లపై సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు విద్యాశాఖ ప్రాథమికంగా మార్గదర్శకాలను రూపొందించింది

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది

NATIONAL NEWS

JEE MAINS 2025 రెండో దశ ఫైనల్ కీ మరియు ఫలితాలు విడుదల.

యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్‌ ది వరల్డ్‌ రిజిస్టర్‌లో భారతదేశ వారసత్వ సంపదలు భగవద్గీత, భరత ముని రచించిన నాట్యశాస్త్రం రాతప్రతులు చోటు దక్కించుకున్నాయి.

ఆక్సియమ్‌-4 మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లా మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనించనున్నారు

ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టులు లొంగుబాటు

INTERNATIONAL NEWS

యెమెన్‌లోని రస్‌ ఇసా ఆయిల్‌ పోర్టుపై అమెరికా దాడులు చేసిందని హౌతీ ఉగ్రవాదులు శుక్రవారం ప్రకటించారు. 74 మంది మరణించారని, 171 మంది గాయపడ్డారని చెప్పారు.

ఎలాన్ మస్క్ తో ఫోనులో మాట్లాడినట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా తెలిపారు.

BUSINESS NEWS

యూపీఐ లావాదేవీల పై ఎలాంటి జిఎస్టి విధించం ఆ ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగు రోజులు లాభాలతో ముగియడంతో మధుపరుల సంపద 26 లక్షల కోట్లకు పెరిగింది

శుక్రవారం భారత్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ ల తులం బంగారం ధర 97,590/- రూపాయలుగా పలికింది.

SPORTS NEWS

IPL 2025. బెంగళూరు పై పంజాబ్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్ల చొప్పున మ్యాచ్ జరిగింది.

ఐపీఎల్ లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ మరియు లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

EDUCATION & JOBS UPDATES

JEE MAIN 2025 ఫైనల్ కీ ని నిన్న విడుదల చేశారు.

JEE MAINS RESULT ఫలితాలను నేడు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు