Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 18 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 18 – 04 – 2025

BIKKI NEWS (APRIL 18) : TODAY NEWS IN TELUGU on 18th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 18th APRIL 2025

TELANGANA NEWS

గ్రూప్ – 1 తుది నియామకాలను తమ ఉత్తర్వులు వెలువలే వరకు నిలిపివేయాలంటూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

భూభారతితో అన్నదాతల కష్టాలు తీరుస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు

ఫ్యూచర్ సిటీలో మరుబెని పార్క్ ఏర్పాటుకు జపాన్ సంస్థ ముందుకు వచ్చింది.

పుప్పాలగూడలో ఐటి నాలెడ్జ్ అబ్బో ఏర్పాటు చేస్తామని బట్టి తెలిపారు

కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని స్పందించి విచారణకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు

తెలంగాణలో ప్రతి లక్ష మందికి 233 మంది పోలీసులు ఉన్నారు

రాజీవ్ యువ వికాసం కొరకు 16.23 లక్షల దరఖాస్తులు అందినట్లు సమాచారం.

జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలపై రుద్దోద్దంటూ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సదస్సులు వక్తలు తమ అభిప్రాయం తెలిపారు.

వేములవాడ రాజన్న ఆలయ విస్తరణకు జూన్ లో పనులు ప్రారంభించాలని ప్రాథమిక అంచనా

ANDHRA PRADESH NEWS

త్వరలో విడుదల చేయనున్న డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

ఏప్రిల్ 19న శ్రీవారి ఆర్థిక సేవ టికెట్ల జులై కోట విడుదల చేయమన్నారు

టిటిడి గోశాల గోవుల మృతి పై సవాళ్లు ప్రతి సవాల్ అనే పద్యంలో భూమన పై కేసు నమోదు

ఎస్సీ వర్గీకరణ పై ఆర్డినెన్స్ జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

కొన్న వెంటనే ఆస్తిపన్ను మార్పు జరిగేలా విజయవాడ కార్పొరేషన్ లో చర్యలు చేపట్టారు

ఏప్రిల్ 28, 29వ తేదీల్లో జరిగే అసిస్టెంట్ డైరెక్టర్ – టౌన్ ప్లానింగ్ పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది

గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలు‌, డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు

NATIONAL NEWS

వర్క్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించజాలవు అని ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ స్పష్టం చేశారు.

పచ్చిమ బెంగాల్ టీచర్లు నియామక కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఆరోపణలు లేని టీచర్లు కొంతకాలం కొనసాగు వచ్చుంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఎప్రిల్ 21 న మోడీ తో భేటీ కానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్

INTERNATIONAL NEWS

సౌరవ్యవస్థ అవతల ఉన్న కే2- 18బీ గ్రహంపై జీవసంబంధ ఆనవాళ్లు గుర్తింపు

అధిక టారిఫ్‌లతో తీవ్ర పరిణామాలు తప్పవంటూ ట్రంప్‌ తాజా విధానాలపై ఫెడ్‌ చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాశ్మీర్ ను మరచిపోం – కాశ్మీర్ మా జీవనాడి అంటూ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది.

స‌మ‌ర్ అబూ ఎలోఫ్‌కు.. 2025 వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ద‌క్కింది. గాజాలో గాయ‌ప‌డి రెండు చేతులు కోల్పోయిన చిన్నారి ఫోటోను తీసిన లేడీ ఫోటోగ్రాఫ‌ర్‌కు అవార్డు ఇచ్చింది

BUSINESS NEWS

STOCK MARKET – భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లో

సెన్సెక్స్ : 78553 (1509)
నిఫ్టీ : 23852 (414)

ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రకారం 2025 – 26 లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.4%

GOLD RATE – ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర 98,170/- రూపాయలు పలికింది.

SPORTS NEWS

IPL 2025 – హైదరాబాద్ పై ముంబై ఘనవిజయం.

నేడు ఐపీఎల్ లో బెంగళూరు – పంజాబ్ మద్య మ్యాచ్

ఫ్రెంచ్ ఓపెన్ 2025 సందర్భంగా తొలి రోజు రఫెల్ నాదల్ ను సన్మానించనన్నారు.

భారత జట్టు సహాయక కోచ్ అభిషేక్ నాయర్ పై బీసీసీఐ వేటు వేసింది

EDUCATION & JOBS UPDATES

JEE MAINS 2025 (II) RESULTS విడుదల

UGC NET 2025 JUNE నోటిఫికేషన్ విడుదల

APPSC – అసిస్టెంట్ డైరెక్టర్ – టౌన్ ప్లానింగ్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.

ఏపీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలు‌, డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు