BIKKI NEWS (OCT. 10) : TODAY NEWS IN TELUGU on 10th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 10th OCTOBER 2024
TELANGANA NEWS
DSC 2024 లో అర్హత సాదించిన అభ్యర్థులకు టీచర్స్ గా నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు నియమించిన ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మణికొండ మున్సిపాలిటీలో డీఈఈగా పనిచేసిన దివ్యజ్యోతి అవినీతి అధికారి అని, ఇదిగో ఆమె సంపాదించిన నోట్ల కట్టలు అంటూ ఆమె భర్త రచ్చకెక్కాడు. ఇంట్లో పలు చోట్ల దాచిపెట్టిన నగదును వీడియోతీసిన సదరు భర్త దానిని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు
రేవంత్‌రెడ్డే అసలు సిసలు కొరివి దయ్యమని, రేవంత్ నుంచి తెలంగాణను కాపాడే కొర్రాయి కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెక్యూరిటీని పెంచారు. గతంలో ఉన్న భద్రతా సిబ్బందికి అదనంగా రెండు పూర్తిస్థాయి టీములను జోడించారు.
మహాత్మాగాంధీ స్మారక నిధికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్’ ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టు కింద 19 నియోజకవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది.
త్వరలోనే అందరికి రుణమాఫీ చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి
హర్యానా ప్రజలు కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మలేదు.. ఇప్పటికైనా రాహుల్ బుద్ధి తెచ్చుకోవాలి : కేటీఆర్
తెలంగాణలో మూడురోజులు ఉరుములతో కూడిన వానలు.. హెచ్చరించిన ఐఎండీ
ANDHRA PRADESH NEWS
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన బుధవారం రాత్రి మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు.
తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు బాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
ఈనెల 10న ఏపీ కేబినెట్ సమావేశం.
ఏపీ మాజీ సీఎం , వైసీపీ నేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్‌ను మెయింటెనెన్స్ చేయడం కష్టమైనా పని కాదని అయితే తాము గుడ్ బుక్‌ను పెట్టి మంచి పనులు చేసే వారి పేర్లను వివరాలను నమోదు చేసుకుంటామని వెల్లడించారు
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు
మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
NATIONAL NEWS
వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) కన్నుమూశారు.
బియ్యం ఎగుమతులపై ఆంక్షల ఎత్తివేత.. భారీగా పెరుగుతున్న ధరలు
సీఎం ఆతిశీ సీఎం బంగ్లాను అనధికారికంగా ఆక్రమించారన్న ఆరోపణలతో రెండు రోజుల క్రితం దిగిన ఆమెను ఎల్జీ ఆదేశాలతో బలవంతంగా ఖాళీ చేయించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, దీనిపై దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హర్యానా ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని ఆరోపించింది.
దేశీయంగా రెండు నూక్లియర్ సబ్‌మెరైన్ల తయారీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ.45 వేల కోట్ల వ్యయంతో ఈ రెండు నూక్లియర్ సబైమెరైన్లను విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో నిర్మించనున్నారు.
ఉచిత బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ఇతర సంక్షేమ కార్యక్రమాల కింద ఉచితంగా సరఫరా చేస్తున్న బలవర్ధకమైన బియ్యం పథకాలను 2028 డిసెంబర్ వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది.
కోల్‌కతా ఘటనకు నిరసనగా.. దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష, క్యాండిల్ మార్చ్
తమిళనాడు రాష్ట్రంలో తిరుపూర్ జిల్లాలోని మతుకళం సమీపంలో టూరిస్ట్ వ్యాన్, కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఐదుగురు మరణించారు.
INTERNATIONAL NEWS
ప్రొటీన్లపై జరిపిన పరిశోధనలకు గానూ రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సబిస్, జాన్ జంపర్‌కు నోబెల్ బహుమతి ప్రకటించారు.
నిమా రింజి షెర్పా రికార్డు క్రియేట్ చేశాడు. 18 ఏళ్ల వయసులోనే 14 పర్వతాలను అధిరోహించాడు. 7వేల మీటర్ల ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న శిఖరాలను ఆ నేపాలీ ఎక్కేశాడు.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం వైపు హరికేన్ మిల్టన్ దూసుకొస్తున్నది. ప్రస్తుతం అయిదో కేటగిరీ తుఫాన్‌గా మిల్టన్ హరికేన్‌ను ప్రకటించారు. దీంతో అనేక పట్టణాలు, నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
ధ్వని వేగానికి మించిన వేగంతో ప్రయాణించే ‘హైపర్‌సానిక్ జెట్’ రూపకల్పనలో ముందడుగు పడింది. అమెరికా స్టార్టప్ ఇంజినీరింగ్ కంపెనీ ‘వీనస్ ఏరోస్పేస్’ అభివృద్ధి చేసిన ‘హైపర్‌సానిక్ జెట్’ టెస్ట్ ఫ్లైట్‌కు సిద్ధమైంది. దీంతో గంటలో న్యూయార్క్ నుంచి లండన్ కు వెళ్ళవచ్చు.
అధునాతన ఆయుధాలకు పేరొందిన ఇజ్రాయెల్ సరికొత్త రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. డ్రోన్ల దాడులు జరుగుతున్న వేళ లేజర్ లైట్‌తో డ్రోన్లను కూల్చగలిగే లైట్ బీమ్ లేజర్ ఇంటర్‌సెప్షన్ వ్యవస్థను తయారుచేసింది.
BUSINESS NEWS
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 81,467 (-167)
నిఫ్టీ : 24,982 (-31)
ఇకపై ‘న్యూట్రల్’ పాలసీనే అవలంభిస్తాం… తాజా ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయం.
మున్ముందు వడ్డీరేట్ల తగ్గింపునకు సంకేతాలు… వరుసగా 10వసారీ రెపోరేటు యథాతథం. రెపోరేటును ఈసారి ద్రవ్య సమీక్షలోనూ 6.5 శాతం వద్దే ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది
యూపీఐ లైట్ వ్యాలెట్‌కున్న పరిమితిని రూ.5,000కు పెంచింది. అలాగే ఒక్కో లావాదేవీకున్న పరిమితిని కూడా రూ.1,000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
బంగారం, వెండి ధరలు వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టాయి. బుధవారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి విలువ రూ.600 దిగి రూ.77,700 వద్ద నిలిచింది. వెండి రేటు ఏకంగా కిలో రూ.2,800 పడి రూ.91,200 పలికింది
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ భారీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15న ప్రారంభం కానున్నది.
SPORTS NEWS
ఐసీసీ మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ లో టీమ్‌ఇండియా 82 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది.
ఏషియన్ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది.
పాకిస్థాన్ తో జరుగుతున్న టెస్టుల్లో జో రూట్ 35వ సెంచరీ సాదించాడు. అలాగే టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కుక్‌ను దాటేశాడు.
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా 86 పరుగుల తేడాతో ణ
ఘనవిజయం సాధించింది. సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది.
EDUCATION & JOBS UPDATES
గ్రూప్-1 మెయిన్ హాల్‌టికెట్లను 14న విడుదల చేయనున్న ట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు ఒక రోజు ముందు (ఈ నెల 21) వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని సైకాలజీ విభాగంలో పార్ట్‌టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రైల్వే గ్రాడ్యుయోట్, అండర్ గ్రాడ్యుయోట్ ఉద్యోగ నోటిఫికేషన్ ల దరఖాస్తు గడువు పెంపు
అక్టోబర్ 14 నుండి CRPF SI నియామక ఈవెంట్స్.