చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 30

★ దినోత్సవం

  • అంతర్జాతీయ అనువాద దినోత్సవం.
  • అంతర్జాతీయ పొడ్కాస్ట్ (వలప్రసారం) దినోత్సవం

★ సంఘటనలు

1667 – గోల్కొండ ఔరంగజేబు సామ్రాజ్యంలో విలీనం చేయబడింది.
1947: పాకిస్థాన్ ఇంకా యెమన్ ఐక్యరాజ్యసమితిలో చేరాయి.
1955: రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది.
1971: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టాడు.
1993: మహారాష్ట్ర లోని లాతూర్ భూకంపం, సుమారు 10,000 ప్రజలు మరణించారు.
2001 – మధ్యప్రదేశ్ , మెయిన్‌పురి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియాతో సహా మొత్తం 8 మంది మరణించారు.
2007 – మెక్సికోలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా భారతీయ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ కొత్త ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.
2008: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
2010: అయోధ్యలోని బాబ్రీ మసీదు రామ మందిర వివాదంపై ప్రయాగ్‌రాజ్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్ , ఆ వివాదాస్పద నేలను మూడు ముక్కలుగా వేరు చేసి, రామ్ లల్లా, నిర్మోహి అఖారా మరియు వక్ఫ్ బోర్డులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చింది.
2012: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చి (కవాతు) జరిగింది.
2020: బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా, సంఘ్ అగ్రనాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది.

★ జననాలు

1207: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ. (మ.1273)
1828: లాహిరి మహాశయులు, భారత యోగీశ్వరుడు, మహావతార్ బాబాజీకి శిష్యుడు. (మ.1895)
1864 – స్వామి అకందానంద , స్వామి రామకృష్ణ శిష్యుడు (మ. 1937 )
1893: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (మ.1965)
1900: ఎం. సి. చగ్లా, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి (మ. 1981 )
1913: ఆర్. రామనాథన్ చెట్టియార్ , తమిళనాడు రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త (మ. 1995 )
1922: హృషీకేష్ ముఖర్జీ, బెంగాలీ-హిందీ సినిమాల దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ. 2006)
1934: అన్నా కష్ఫి, భారత-అమెరికన్ నటీమణి (మ. 2015)
1941: కమలేశ్ శర్మ, భారత దౌత్యవేత్త, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్‌
1951: రేలంగి నరసింహారావు, తెలుగు చలనచిత్ర దర్శకుడు , హాస్య చిత్రాలకు ప్రసిద్ది.
1961: చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1966 – శంకర్ బాలసుబ్రమణియన్ , భారతీయ-బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త
1967: దీప్తి భట్నాగర్ , భారతీయ సినీ నటీ , మోడల్, టీ వి.వ్యాఖ్యత .
1964: మోనికా బెల్లూచి ఇటలీ నటి, ఫ్యాషన్ మోడల్ జననం.
1970:దీపా మాలిక్, భారత క్రీడాకారిణి.
1972: శాంతను ముఖర్జీ(షాన్), పేరుగాంచిన భారత గాయకుడు
1980: మార్టినా హింగిస్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి.

★ మరణాలు

1955: జేమ్స్ డీన్, అమెరికాకు చెందిన నటుడు (జ.1931).
1990: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు సుప్రసిద్ధ నవలా రచయిత (జ.1954).
2001: మాధవరావు సింధియా, రాజకీయ నాయకుడు (జ.1945).
2012: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు (జ.1923).
2014: మౌల్వి ఇఫ్తిఖర్ హుస్సేన్ అన్సారీ, భారత మతగురువు, రాజకీయ నాయకుడు. (జ.1940).