చరిత్రలో ఈరోజు అక్టోబర్ 20

★ దినోత్సవం

ప్రపంచ గణాంక దినోత్సవం.
ప్రపంచ ఆస్టియో పోరోసిస్ ( ఎముకల సంబంధ వ్యాధి ) రోజు.

★ సంఘటనలు

1774: భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్‌ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు.
1920: సెన్సార్‌ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1947: భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు.
1962: పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్‌పై దాడి చేసింది.

★ జననాలు

1855: గోవర్ధన్‌రాం త్రిపాఠీ – గుజరాతీ నవలా రచయిత. (మ.1907)
1930: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017)
1935: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (మ.2018)
1938: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983)
1951: కందుకూరి శ్రీరాములు, నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.
1978 : వీరేంద్ర సెహ్వాగ్, భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
1986 : ప్రియాంక శర్మ, భారతీయ నటి.
1987: రాధికా చౌదరి , హిందీ,తెలుగు,తమిళ,నటి , దర్శకురాలు.
1997: తులసి నాయర్ , మోడల్, తమిళ నటి(నటి రాధ కుమార్తె)
1979: సోనూ కక్కర్ , నేపథ్య గాయని.

★ మరణాలు

1990: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916)
2010: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (జ.1919)
2011: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)