★ సంఘటనలు
1952: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
1954: బీజింగ్లో భారత ప్రధానమంత్రి నెహ్రూ చైనా నాయకుడు మావోను కలిసాడు.
1970: పూర్వపు సంస్థానాధీశుల ప్రీవీ పర్సు లను ప్రభుత్వం రద్దు చేసింది.
1983: ప్రొ.సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ తన 73వ పుట్టినరోజునాడు ఫిజిక్స్ నోబెల్ పురస్కారానికి ప్రొ.విలియం ఫౌలర్ తో కలిసి ఎంపికయ్యాడు.
1983: ముంబైలో 13 జౌళి పరిశ్రమ లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ బొంబాయి జౌళి పరిశ్రమల సమ్మె ముగిసింది. ఈ సమ్మెకు దత్తా సామంత్ నాయకత్వం వహించాడు.
1987: అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఘోరపతనం. డౌ జోన్స్ సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్ చరిత్రలో ఈ పతనం బ్లాక్‌మండేగా ప్రసిద్ధి చెందింది.
★ జననాలు
1864: ఆచంట సాంఖ్యాయన శర్మ, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. (మ.1933)
1910: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత (మ.1995).
1916: వడ్డూరి అచ్యుతరామ కవి, తెలుగు కవి, పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పురాణ ప్రవచకుడు. (మ.1996)
1917: ఎస్.ఎస్.శ్రీఖండే, భారతీయ గణిత శాస్త్రవేత్త.
1929: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు (మ.2010).
1955: గుణ్ణం గంగరాజు, సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో ఈయన మంచి పనితనానికి ప్రసిద్ధుడు.
1958: రాధశ్రీ అనే కలం పేరు కలిగిన దిడుగు వేంకటరాధాకృష్ణ ప్రసాద్, పద్యకవి, శతకకారుడు.
1987: సాకేత్ మైనేని, ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో మనదేశానికి స్వర్ణపతకం సాధించాడు
★ మరణాలు
1937: ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు (జ.1871).
1986: టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (జ.1919).
1987: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక ఆంధ్రప్రభను నడిపించిన సంపాదకుడు (జ. 1915).
1991: ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు (జ.1917).
2006: శ్రీవిద్య , చలనచిత్ర నటి, గాయని.(జ.1953)
2013: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత (జ.1928).
2015: కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు (జ.1945).