న్యూడిల్లీ (అక్టోబర్ – 19) : తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపి సీనియర్ నేత నల్లు ఇంద్రాసేనా రెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ (Nallu indrasenaReddy as a governor)చేశారు. దీంతో తెలంగాణ నుండి ప్రస్తుతం గవర్నర్ గా పని చేస్తున్న వారి సంఖ్య రెండు కు చేరింది.
తెలుగు రాష్ట్రాల నుండి ప్రస్తుతం గవర్నర్లుగా పనిచేస్తున్న వారి సంఖ్య మూడుకు చేరింది. బండారు దత్తాత్రేయ హర్యానా కు, కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా పని చేస్తున్నారు.
అలాగే ఒడిశా రాష్ట్ర నూతన గవర్నర్ గా బీహార్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించింది.