◆ దినోత్సవం
- అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం.
- ప్రపంచ గుడ్డు దినోత్సవం.
★ సంఘటనలు
1679: పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
★ జననాలు
1860: హెచ్.వి. నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
1923: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు. (మ.2012)
1936: వీణాపాణి, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (మ.1996)
1956: సిరికొండ మధుసూధనాచారి, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
1965: కల్పనా రంజని , దక్షిణ భారత చలన చిత్ర హాస్య నటి.(మ.2016)
1973: కందికొండ యాదగిరి , గీత రచయిత,కవి ,(2022)
1990: పూజా హెగ్డే ,, మోడల్,తెలుగు,తమిళ, చిత్రాల నటి.
1993: హనుమ విహారి, ఆస్ట్రేలియాలో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు.
★ మరణాలు
1911: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (జ.1867)
1987: కిషోర్ కుమార్, సుప్రసిద్ద హిందీ సినీ నటుడు, గాయకుడు. (జ.1929)
2006: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924)
2020: గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (జ.1947)