TODAY IN HISTORY MAY 30th – చరిత్రలో ఈరోజు మే 30

TODAY IN HISTORY MAY 30th

దినోత్సవం
  • ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం
  • గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం.
సంఘటనలు

1962: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి.
1987:30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు.
2008: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.

జననాలు

1903: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1973)
1921: కంచనపల్లి పెదవెంకటరామారావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
1952: ఎల్.బీ. శ్రీరాం ,తెలుగు నటుడు,రచయిత , దర్శకుడు.
1958: కె.ఎస్.రవికుమార్ , దర్శకుడు, నిర్మాత.
1977: గోపీ సుందర్ , గాయకుడు,సంగీత దర్శకుడు, గీత రచయిత, నటుడు
1987: అల్లు శిరీష్, తెలుగు సినిమా నటుడు, అల్లు అరవింద్ కుమారుడు.
1992: అవంతిక మిశ్రా , తెలుగు తమిళ చిత్రాల నటి.

మరణాలు

1744: అలెగ్జాండర్ పోప్, పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688)
2007: గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
2010: బలరాం నందా, భారత చరిత్రకారుడు.
2017: దాసరి నారాయణరావు తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడు. (జ.1942)
పండుగలు , జాతీయ దినాలు