Today in history may 28th – చరిత్రలో ఈరోజు మే 28

Today in history may 28th
దినోత్సవం
  • నేపాల్ గణతంత్ర దినోత్సవం
సంఘటనలు

1994: ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
2008: సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

జననాలు

1883: వినాయక్ దామోదర్ సావర్కర్, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో చురుకుగా పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు (మ.1966)
1896: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953)
1923: నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996)
1941: సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు.
1956: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1958: కోటీ,(సాలూరుకోటేశ్వర రావు) సంగీత దర్శకుడు .
1996: గట్టెం వెంకటేష్, సూక్ష్మకళలో గిన్నిస్ రికార్డ్‌ను సృష్టించిన తెలుగు యువకుడు.

మరణాలు

1997: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930)
1999: బి.విఠలాచార్య, ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920)
2001: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921)
2022: ఎడవ బషీర్, మలయాళ సినిమా నేపథ్య గాయకుడు. (జ.1943)