చరిత్రలో ఈరోజు మే 25

దినోత్సవం
  • అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం
సంఘటనలు

2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.

జననాలు

1808: రోల్ఫ్ ఎమర్సన్, కవి.
1865: పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943)
1886: రాష్ బిహారీ బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ. 1945)
1897: కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)
1899: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).
1936: రూసీ సూత్రీ, భారత క్రికెటర్. (మ.2013)
1938: ఇవటూరి విజయేశ్వరరావు, వాయులీన విద్వాంసుడు (మ.2014).
1940: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020)
1948: మాదాల రంగారావు, తెలుగు సినీ నటుడు, నిర్మాత,దర్శకుడు (మ.2018)
1959: కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
1968: రావు రమేష్ , చలన చిత్ర నటుడు, దర్శకుడు,
1972: కరణ్ జోహార్, భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు.
1974: యమునా కృష్ణన్, భారత రసాయన శాస్త్రవేత్త
1977: కార్తీక్ శివకుమార్,(కార్తీ ) తెలుగు, తమిళ సినీ నటుడు.
1979: అమ్మ రాజశేఖర్ , చలన చిత్ర దర్శకుడు , కొరియోగ్రాఫర్ .

మరణాలు

1924: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)
1964: గాలి పెంచల నరసింహారావు, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు, సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. (జ. 1903)
1989: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (జ.1907)
2005: సునీల్ దత్, భారత దేశ సినిమా నటుడు, రాజకీయవేత్త మరణం. (జ.1929)
2019: బండారు శారారాణి తెలంగాణకు చెందిన రాజకీయనాయకురాలు. మాజీ ఎమ్మెల్యే. (జ.1964)