దినోత్సవం
- జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం.
- చిలీ దేశపు నేవీ డే (నౌకాదళ దినోత్సవము) (1879 లో జరిగిన ఇంక్విక్ యుద్ధం).
- సెయింట్ హెలెనా దినోత్సవము (1502 లో ఇదేరోజున ఈ దీవిని కనుగొన్నారు)
- ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము (వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ (ఇంటర్నేషనల్)
సంఘటనలు
0143: అమెరికా చరిత్రకారులకు తెలిసిన అతిపురాతనమైన సంవత్సరం. ఈ రోజున ‘మాయా నాగరికత’ కన్నా ముందు పాలించిన రాజు ‘కింగ్ హర్వెస్ట్-బెర్‌గ్వోర్‌స్ట్’ సింహాసనం ఎక్కిన సంవత్సరం.
1502: సెయింట్ హెలెనా దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ జో డ నోవా కనుగొన్నాడు.
1819: మొట్టమొదటి ‘సైకిల్’ (రెండుచక్రాల వాహనం) (స్విఫ్ట్ వాకర్) ని అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు.
1829: సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్ జాహి మరణించాడు.
1851: దక్షిణ అమెరికా లోని కొలంబియాలో బానిసత్వాన్ని రద్దుచేసారు.
1871: యూరప్ లో మొట్టమొదటి రైలు (స్విట్జర్లాండ్ అందాలను చూడటానికి రిగి కొండ ‘రిగి రైల్వేస్ (రిగి-బాహ్నెన్) ఏర్ఫాటు చేసారు. (‘రేక్’ టెక్నాలజీని వాడారు).
1881: క్లారా బార్టన్ ‘అమెరికన్ రెడ్ క్రాస్’ ని స్థాపించాడు.
1894: ఇంగ్లాండ్ లో ‘మాంచెస్టర్ షిప్ కెనాల్’ ని విక్టోరియా మహారాణి అధికారికంగా ప్రారంభించి, ఆ కాలువను డిజైన్ చేసిన ‘సర్ ఎడ్వర్డ్ లీడర్ విలియమ్స్’ కి ‘నైట్‌హుడ్’ బిరుదు ఇచ్చింది.
1908: మొట్టమొదటి హర్రర్ సినిమా (డాక్టర్ జెకీల్ అండ్ మిస్టర్ హైడ్) చికాగో (అమెరికా)లో విడుదల అయ్యింది.
1916: ‘సమ్మర్ టైమ్’ (డేలైట్ సేవింగ్ టైమ్) ని బ్రిటన్ అమలులో పెట్టింది.
1929: మొట్ట మొదటి సారి, న్యూయార్క్ లోని ‘స్టాక్ ఎక్స్చేంజి’ లో ‘ఆటోమాటిక్ ఎలెక్ట్రిక్ స్టాక్ కొటేషన్ బోర్డ్’ ఏర్పాటు చేసారు.
1934: తన మునిసిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరి వేలిముద్రలు సేకరించిన మొట్టమొదటి అమెరికన్ మునిసిపాలిటి ‘ఒస్కాలూసా (అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉంది).
1937: ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.
1938: ‘ఆస్ట్రేలియ-సర్రీ’ క్రికెట్ మాచ్ లో బ్రాడ్‌మన్ 143 పరుగులు సాధించాడు. (198 నిమిషాలు 11 ఫోర్లు (ఫోర్స్)).
1958: బ్రిస్టల్ ప్రాంతంలో ‘సబ్‌స్క్రైబర్ డయలింగ్ సిస్టం (ఎస్.టి.డి)’ ని 1958 డిసెంబరు నుంచి ప్రవేశపెడుతున్నట్లు, యునైటెడ్ కింగ్డం పోస్ట్ మాస్టర్ జనరల్ ఎర్నెస్ట్ మార్‌ప్లెస్ ప్రకటించాడు.
1990: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్గా కలిసి పోవటానికి రెండు దేశాలు ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ యెమెన్’, ‘నార్త్ యెమెన్’ లు అంగీకరించాయి.
1990: డౌ జోన్స్ (అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ – మన నిఫ్టీ, సెన్సెక్స్ లాగ) 2844.68 స్థాయిని తాకింది.
1991: రాజీవ్ గాంధీ, మాజీ భారత ప్రధాన మంత్రిని, ‘నళిని’ అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి (‘ఎల్.టి.టి.ఇ’ కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది.
1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్‌గా ఎన్నికైంది.
1996: టాంజానియా కి దగ్గరలో ఉన్న విక్టోరియా సరస్సు లోఎమ్.వి. బుకొబ ములిగి పోయింది. 1000 మంది మరణించారు.
2003: ఉత్తర అల్జీరయాలో భూకంపం వచ్చి 2000 మందికి పైగా ప్రజలు మరణించారు.
2007: కడప జిల్లాలో కోటి టన్నుల సామర్ద్యము గల ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వము గాలి జనార్ధన రెడ్డికి చెందిన బ్రహ్మణి ఇండస్ట్రీస్ తో ఒప్పందం చేసుకుంది
2009: జర్మనీ అధ్యక్షుడిగా హర్ట్స్ కొహ్లర్ రెండోసారి ఎన్నికయ్యాడు.
జననాలు
0427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథెన్స్ (?)
1688: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (మ.1744)
1893: ఏకా ఆంజనేయులు, సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.
1941: భమిడి కమలాదేవి, సంగీత విద్వాంసురాలు.
1960: మోహన్ లాల్, మళయాల చిత్రరంగంలో అగ్రఘన్యుడు, భారతీయ సినీ నటుడు.
1961: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (మ.2015)
1975: అబ్బాస్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు.
1976; అతిథి గోవి త్రికర్ , నటి, మోడల్, ప్రపంచ సుందరి
1983: కావేరి ఝా , తెలుగు, హిందీ చిత్రాల నటి , మోడల్ .
1991: జాని తక్కెడశిల, తెలుగు కవి, రచయిత, విమర్శకులు
మరణాలు
1786: కార్ల్ విల్హెల్మ్ షీలే, జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (జ.1742)
1940: కౌతా ఆనందమోహనశాస్త్రి, వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. (జ.1908)
1975: జీ.అశ్వద్ధామ , సంగీత దర్శకుడు (జ.1927)
1991: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1944)
1998: రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చలనచిత్ర నటుడు (జ.1925)
2019: బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు. (జ.1925)
2023: రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (జ. 1954)