చరిత్రలో ఈరోజు మే 20

దినోత్సవం

ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం
ప్రపంచ తేనెటీగ దినోత్సవం
తెలుగు కార్టునిస్టుల దినోత్సవం
1819: ‍కెనడా విజయదినం. (సోమవారం).
1902: క్యూబా స్వతంత్ర దినం.
1927: సౌదీ అరేబియా స్వతంత్ర దినం.
1979: మృతవీరుల దినం (కంబోడియాలో).

సంఘటనలు

0325: మొదటి క్రిస్టియన్ క్రైస్తవ సంబంధ మండలి ఆసియా మైనర్ లోని నికా దగ్గర మొదలైంది.
0526: సిరియా లోని ఏంటియోచ్ లో జరిగిన భూకంపంలో 2,50,000 మంది మరణించారు
1259: హెన్రీ III, ఇంగ్లాండ్ రాజు, ఫ్రాన్స్కు నార్మండీని ఇచ్చేసాడు.
1277: పోప్ జాన్ XXI మరణించాడు.
1293: జపాన్ లోని కమకురాలో జరిగిన భూకంపంలో 30,000 మంది మరణించారు.
1302: ఇంగ్లాండ్, గాస్కోనీ తిరిగి గెలుచుకుంది.
1498 : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు.
1537: హీరోనిమస్ ఫాబ్రిసియస్ అబ్ ఆక్వాపెండెంటె, సర్జన్, శరీర నిర్మాణ శాస్త్రవేత్త పుట్టాడు (మన శుశృతుడు లాగ.
1553: మూడు ఆంగ్ల నౌకలు. వాయవ్య మార్గమును వెదుకుతూ ప్రయాణం చేసాయి.
1609: థామస్ తోర్పె విలియం, షేక్స్పియర్ రచించిన సాన్నెట్ లను (ఇంగ్లీష్ భాషలో రచించే ప్రశ్న, జవాబుతో కూడిన పద్యము). ముద్రించాడు. బెంగాలీ రచయిత్రి తోరు దత్ ఈ సాన్నెట్లు రచించింది.
1622: ఉస్మాన్ II, ఒట్టోమన్ సుల్తాన్, అధికారము నుంచి, తొలగించి, హత్య చేసారు.
1639: మొదటి అమెరికన్ ప్రభుత్వ పాఠశాల డోర్చెస్టెర్ (మసాచుసెట్స్ రాష్ట్రము) లో ఏర్పాటు, చేసారు.
1830: మొదటి రైలుమార్గపు కాల పట్టిక (టైమ్ టేబుల్ ]], “బాల్టిమోర్ అమెరికన్” వార్తాపత్రిక లో, ప్రచురించబడింది
1875: ‘ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్’ (అంతర్జాతీయ తూనికలు, కొలతల సంస్థ) స్థాపించారు.
1899: జాకబ్ జర్మన్ అనే న్యూయార్క్ నగరవాసి, టాక్సి కేబ్ ని, నిర్దేశించిన, గంటకు 12 మైళ్ళ వేగాన్ని, మించి, అతివేగంగా, నడుపుతున్నందుకు లెక్సింగ్టన్ అవెన్యూలో అరెస్టు చేసారు. అతివేగంగా నడుపుతూ అరెస్ట్ అయిన మొదటి డ్రైవర్ అతడే.
1902: అమెరికా, క్యూబా ఆక్రమణకు ముగింపు పలికింది.
1913: గుంటూరు జిల్లా బాపట్లలో మొదటి సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు.
1950: అమెరికాలో “సైనిక దళాల రోజు (ఆర్మ్ డ్ ఫోర్సె డే)]], నిజానికి “ఆర్మీ డే” 1950 నుండి మే మూడవ శనివారం జరుపుకుంటున్నారు.
1972: కామెరూన్ రాజ్యాంగ దినం.
1989: చైనీస్ ప్రీమియర్ లి, తియాన్మెన్ స్క్వేర్లో ఉధృతమైన విద్యార్థి ప్రదర్శనలకు, ప్రతిస్పందనగా బీజింగ్లో యుద్ధ చట్టం (మార్షల్ లా) ప్రకటించాడు.
1990: హబుల్ స్పేస్ టెలిస్కోప్ మొదటి ఛాయాచిత్రాలను భూమికి పంపింది.
1992 భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని స్వంతంగా ప్రయోగించింది.
1999: 15 ఏళ్ల బాలుడు, కన్యేర్స్ లోని హెరిటేజ్ హై స్కూల్ లో, తుపాకితో కాల్పులు జరపగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.
2006: గ్వాంటనామా బే నిర్బంధ శిబిరం వద్ద అల్లర్లు జరిగాయి.
2007: డేవిడ్ హిక్స్ను గ్వాంటనామా బే నుంచి ఆస్ట్రేలియా జైలుకి బదిలీ చేసారు.
2008: తైవాన్ అధ్యక్షుడిగా మా యింగ్ జ్యో పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
2009: ఇండోనేషియాలో విమానం కూలి 100 మంది మరణించారు.
2010: యు ట్యూబ్, ఫేస్ బుక్ లను పాకిస్తాన్ నిషేధించింది.
2011: పశ్చిమ బెంగాల్‌లో 34ఏళ్ళ సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది.
2012: గుంటూరు జిల్లాలోని, రెంటచింతలలో 47 డిగ్రీల సెంటిగ్రేడ్ (116.6 డిగ్రీల ఫారెన్ హీట్ ) వేడి.
2012: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే 2012 సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 2012 మే 20 ఆదివారం జరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం,తిరుపతి నగరాల్లోని 101 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 48,178 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావచ్చును. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండో పరీక్ష జరిగింది.

జననాలు

1896: అబ్బూరి రామకృష్ణారావు, పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది (మ.1979).
1913: విలియం హ్యూలెట్, హ్యూలెట్ పాకార్డ్ కంపెనీ సహ-స్థాపకుడు (మ.2001).
1915: మోషే డయన్, ఇజ్రాయెల్ మిలిటరీ జనరల్, రాజకీయనాయకుడు. ఇజ్రాయెల్ ను ప్రపంచపటం నుంచి తొలగిస్తామన్న ఆరబ్ దేశాలను గడ గడలాడించి, ఓడించిన ఇజ్రాయెల్ దేశపు సింహం (మ.1981).
1933: జె. వి. రమణమూర్తి, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు (మ.2016).
1939: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ ఛాయాగ్రహకుడు, దర్శకుడు (మ.2014).
1944: దూడం నాంపల్లి, అనేక ప్రక్రియలలో మూడున్నర దశాబ్దాల పాటు సాహిత్య సేవ చేశాడు (మ.2013).
1955: సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు సినీ గీతరచయిత.
1967: వనమాలి: తెలుగు సినీ గీతరచయిత .
1970: పరిటాల సునీత, ప్రస్తుతము రాప్తాడు నియోజక వర్గ శాసన సభ్యురాలిగా ఉన్నారు, మంత్రిపదవి నిర్వహిస్తున్నారు.
1978: పి.టి.ఉష, భారత మాజీ అథ్లెటిక్స్ క్రీడాకారిణి
1979: వేణు శ్రీరామ్ , చిత్ర దర్శకుడు.
1983: జూనియర్ ఎన్.టి.ఆర్, తెలుగు సినిమా నటుడు.
1984: మంచు మనోజ్ కుమార్, తెలుగు సినిమా నటుడు.

మరణాలు

1506: క్రిష్టొఫర్ కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్.తి. (జ.1451).
1932: బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు (జ.1858).
1957: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి (జ.1872).
1989: జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త (జ.1904).
1994: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1909)
1998: ఫ్రాంక్ సినట్రా, హాలీవుడ్ నటుడు (జ.1915).
2021: యు.విశ్వేశ్వర రావు , తెలుగు సినీ నిర్మాత,దర్శకుడు