Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు జూన్ 02

చరిత్రలో ఈరోజు జూన్ 02

దినోత్సవం
  • తెలంగాణ అవతరణ దినోత్సవం
సంఘటనలు

1806: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
1953: యునైటెడ్ కింగ్‌డమ్ కు మహారాణిగా రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం
1910: చార్లెస్ రోల్స్ – ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు.
2014: భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ.
2014: భారతదేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ.
2023: ఒడిశాలో రైలు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 288 మంది మరణించారు, 1,000 మంది గాయపడ్డారు.
2023: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి.

జననాలు

1889: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928)
1897: కొత్త భావయ్య, చారిత్రక పరిశోధకుడు (మ.1973).
1939: విష్ణు నారాయణ్ నంబూత్రి, మలయాళ కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1943: ఇళయరాజా, భారత గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు.
1956: మణిరత్నం, భారతదేశ సినిమా దర్శకుడు.
1961: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
1964: గుణశేఖర్ , ప్రముఖ చలనచిత్ర దర్శకుడు.
1975: ఉత్తేజ్, తెలుగు సినిమా హస్యనటుడు, రచయిత.
1987: సోనాక్షి సిన్హా , భారతీయ సినీ నటీ, కాస్ట్యూమ్ డిజైనర్.
1988: హేమచంద్ర, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకుడు.

మరణాలు

1882: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (జ.1807)
1988: రాజ్‌ కపూర్, భారతదేశ హిందీ నటుడు, దర్శకుడు, నిర్మాత మరణం. (జ.1924)