చరిత్రలో ఈరోజు డిసెంబర్ 01

★ దినోత్సవం

  • ప్రపంచ ఎయిడ్స్ దినం.
    *-నాగాలాండ్ దినోత్సవం.
  • సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం.
  • మయన్మార్ జాతీయ దినం.

★ సంఘటనలు

1963: నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది.
1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేసారు.
1965: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం.
2006: 15వ ఆసియా క్రీడలు దోహా లో ప్రారంభమయ్యాయి.

★ జననాలు

1699: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి (మ.1719).
1878: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి. (మ.1945)
1908: నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం (మ.1985).
1918: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991)
1946: రేగులపాటి కిషన్ రావు, కవి, నవల రచయిత (మ. 2023)
1954: మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.
1955: ఉదిత్ నారాయణ్ , నేపథ్య గాయకుడు.
1970: జె.కె.భారవి , రచయిత .
1944: డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.
1980: ముహమ్మద్ కైఫ్, భారత క్రికెట్ క్రీడాకారుడు.
ర్యాలి ప్రసాద్ , వచన కవితా సహస్రావధాని, రచయిత

★ మరణాలు

1995: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (జ.1947)
2002: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (జ.1924)
2020: నోముల నర్సింహయ్య, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1956)