TODAY CURRENT AFFAIRS IN TELUGU MARCH 1st
1) ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేతగా నిలిచిన జట్టు ఏది?
జ : పుణేరి పల్టన్ (హర్యానా స్టీలర్స్ పై)
2) ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందజేయమన్నారు.?
జ : 300 యూనిట్ లు
3) ఒడిశా – పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు వచ్చేలా ఏ పేరు పెట్టారు.?
జ : మెలనోక్లమిస్ ద్రౌపది
4) “వరల్డ్ ఐకాన్ 21 అవార్డు” కు ఎంపికైన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : గుళ్ళపల్లి ఎన్ రావు
5) భారత్ – బ్రిటన్ ఎచీవర్స్ పురస్కారం అందుకున్న భారతీయ డాక్టర్ ఎవరు.?
జ : డా. రఘురాం
6) దేశవ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రానిక్ చిప్ ల తయారీ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.?
జ : 3
7) భారత్ లో చిరుతల స్థితి – 2022 నివేదిక ప్రకారం భారత్ లో ప్రస్తుతం ఎన్ని చిరుతలు ఉన్నాయి.?
జ : 13,874
8) భారత్ లో చిరుతల స్థితి – 2022 నివేదిక ప్రకారం భారత్ లో ఏ రాష్ట్రంలో అత్యధికంగా చిరుతలు ఉన్నాయి.?
జ : మద్యప్రదేశ్ (3,907)
9) ప్రాన్స్ లో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి (లీప్ సంవత్సరం ఫిబ్రవరి 29న) వెలవడే పత్రిక పేరు ఏమిటి.?
జ : లా బౌగీ డూ సప్పర్
10) KISS AWARD 2023 ను ప్రపంచవ్యాప్తంగా మానవత్వం పెంపునకు కృషి చేసిన ఎవరికి అందజేశారు.?
జ : బిల్ గేట్స్
11) ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గరిష్టంగా ఎన్ని వేల రూపాయల రాయితీ అందజేయనున్నారు.?
జ : 78,000/-
12) టి20 లలో వేగవంతంగా 10,000 రన్స్ పూర్తి చేసుకున్న బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : బాబర్ ఆజామ్
13) కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ఎవరిని నియమించారు.?
జ : ఎఎస్ రాజీవ్
14) గాన సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ అవార్డును ఎవరికి అందజేశారు.?
జ : సురేష్ వాడ్కర్
15) దోస్తీ – 16 పేరుతో నావికా విన్యాసాలను ఏ మూడు దేశాలు చేపట్టాయి.?
జ : భారత్, శ్రీలంక, మాల్దీవులు
16) 2030 వరకు 1.5 లక్షల టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తిని ఏ దేశం లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : వియత్నం