BIKKI NEWS (AUG. 28) : Tiger census 2024 in telangana. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 4వ పులుల గణాంకాల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 33 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 26 పెద్దపులులు, 7 కూనలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారంలో ఒక పెద్దపులి ఉన్నట్టు ఫారెస్ట్ వెల్లడించారు.
Tiger census 2024 in telangana.
2020లో 14 పెద్దపులుండగా ప్రస్తుతం ఈ సంఖ్య 33కి పెరిగిందని తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ చీఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు పేర్కొన్నారు.
పులుల సంతతిపై ట్రాప్ కెమెరాలతో విస్తృతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అమ్రాబాద్ నుంచి నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాల మధ్య పులుల రాకపోకలు ఎక్కువగా సాగుతున్నట్టు గుర్తించామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్‌లతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్ టైగర్ రిజర్వ్‌ను కన్జర్వేషన్ జోన్‌గా ప్రభుత్వం గుర్తించిందని వెల్లడించారు.