BIKKI NEWS (MARCH 07) : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా మార్చి 8, 9, 10 వ తేదీలలో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ (three days holidays cancelled in telangana state) చేశారు.
శివరాత్రి, రెండో శనివారం మరియు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు పబ్లిక్ హాలిడేస్ రాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ యధావిధిగా పనిచేయాలని తహసీల్దారులకు, సూపరింటెండెంట్ లకు, కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ జిల్లాలో వరుసగా ఉన్న మూడు రోజుల సెలవులు రద్దు అయి, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పని చేయనున్నాయి.