BIKKI NEWS (JUNE 11) : TGPSC POSTPONED GROUP 3 CERTIFICATE VERIFICATION. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 గ్రూప్-3 సర్టిఫికెట్ వెరిఫికెషన్ ను వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 18 నుంచి జులై 6 వరకు జరగాల్సి ఉంది.
TGPSC POSTPONED GROUP 3 CERTIFICATE VERIFICATION
గ్రూప్-2 సర్వీసు పోస్టుల తుది నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్-3 ధ్రువపత్రాల పరిశీలన వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి షెడ్యూలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.
గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో కొందరికి రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. అవరోహణ క్రమంలో గ్రూప్-1, గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3 పరిశీలన చేపట్టాలని కమిషన్‌ను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
గ్రూప్-2, 3కు ఒకేసారి పరిశీలన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తే రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏదో ఒకటి వదిలిపెట్టాల్సి ఉంటుంది. కమిషన్ నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడించాక.. భర్తీ కాని, ఉద్యోగాల్లో చేరని పోస్టులన్నీ బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోతాయి.
గతంలో గురుకుల నియామక ప్రక్రియలోనూ అవరోహణ క్రమం పాటించకుండా ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అన్ని ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు ఒకేసారి ఫలితాలు వెల్లడించారు. దీంతో చాలా మంది ఒకటికి మించి పోస్టులకు ఎంపిక కావడంతో దాదాపు 1,800 పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మారాయి. ఈ పరిస్థితి అధిగమించేందుకు గ్రూప్-2 నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్-3 ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టవద్దని అభ్యర్థులు కోరడంతో కమిషన్ వాయిదా వేసింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్