Home > JOBS > TGPSC > Group 4 లో భారీగా పోస్టుల బ్యాక్‌లాగ్.?

Group 4 లో భారీగా పోస్టుల బ్యాక్‌లాగ్.?

BIKKI NEWS (NOV. 16) : TGPSC GROUP 4 BACKLOG POSTS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా తుది ఫలితాలు ప్రకటించిన గ్రూప్‌-4 లో భారీగా పోస్టులు బ్యాక్‌లాగ్‌ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. దాదాపు వెయ్యి కి పైగా ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగలనున్నాయి.

TGPSC GROUP 4 BACKLOG POSTS

ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఈ పోస్టులు మళ్లీ బ్యాక్‌లాగ్‌ అవుతాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తుది ఫలితాలకు ముందు ఆన్‌ విల్లింగ్‌ (ఉద్యోగం ఇష్టంలేదని) ఆప్షన్‌ తీసుకుంటే ఈ పోస్టులు బ్యాక్‌లాగ్‌ అయ్యేవికావని, నిరుద్యోగులకు నష్టం జరిగేది కాదని అభ్యర్థులంటున్నారు..

ఇది వరకు పోస్టుల భర్తీ లో రీలింక్విష్‌మెంట్‌ అవకాశం కల్పించారు. కానీ అకస్మాత్తుగా రీలింక్విష్‌మెంట్‌ ఆప్షన్‌ను ప్రభుత్వం తొలగించినట్టు అభ్యర్థులు వాపోతున్నారు. అటు అన్‌ విల్లింగ్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడం, ఇటు రీలింక్విష్‌మెంట్‌ ఆప్షన్‌ను తొలగించడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. ఆన్‌ విల్లింగ్‌ ఆప్షన్‌ ఇచ్చి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

గ్రూప్‌-4 ఫలితాలను గురువారం విడుదల చేశారు. 8,180 పోస్టులకు 8,084 పోస్టుల ఫలితాలు విడుదల చేశారు. అయితే ఉద్యోగాలు పొందిన వారిలో చాలా మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నవారున్నారు. కొందరు టీచర్లుండగా, మరికొందరు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా మంచి శాఖల్లో, మంచి పోస్టు వస్తే గ్రూప్‌-4 ఉద్యోగంలో చేరాలన్న ఆశతో గ్రూప్‌-4కు రాశారు. అయితే చాలా మందికి మంచి పోస్టులు దక్కలేదు. దీంతో వారంతా ఆయా పోస్టులను వదులుకోనున్నట్లు సమాచారం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు