BIKKI NEWS (DEC. 17) : TGPSC GROUP 2 EXAMS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి రెండు రోజుల పాటు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండో రోజు ఉదయం జరిగిన పేపర్-3 పరీక్షకు 2,51,738 (45.62%) మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్-4 పరీక్షకు 2,51,486 (45.57%) మంది హాజరయ్యారు.
TGPSC GROUP 2 EXAMS.
పేపర్-3 (ఎకానమీ) కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. ఈ పేపర్‌లో కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్‌లు, సర్వేలు, పంటలు, జనాభా లెక్కలు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, మహాలక్ష్మి పథకం, రెవెన్యూ లోటు, జిల్లాల ర్యాంకులు తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి.
మధ్యాహ్నం జరిగిన పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, చరిత్ర)లో తెలంగాణ తల్లి విగ్రహంపై సహా అన్ని అంశాలను స్పృశిస్తూ ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ఉద్యమం, కమిటీలు, ఉద్యమకారులు, సంస్థలు, పార్టీలు, ఉద్యమ గేయాలు, రైతు ఉద్యమాలు, నిజాం పాలన, విప్లవ సంస్థలు, ఎన్టీఆర్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ ప్రభుత్వాలపై ప్రశ్నలు వచ్చాయి. ఉద్యమంలో కేసీఆర్, సోనియాగాంధీ, చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ పాత్రలపై ప్రశ్నలున్నాయి. పేపర్-4 ప్రశ్నపత్రం సులభంగా ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE