BIKKI NEWS (DEC. 15) : TGPSC GIVES ONLY SYLLABUS SAYS BURRA VENKATESHAM. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ నోటిఫికేషన్ లకు సంబంధించి కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ పుస్తకం చదవాలన్నది అభ్యర్థుల ఇష్టమని చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.
TGPSC GIVES ONLY SYLLABUS SAYS BURRA VENKATESHAM
ఏ పుస్తకం ప్రామాణికమో తాము చెప్పకూడదని తెలిపారు. గతంలో హైకోర్టులో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణీకం కాదు అని అపిడవిట్ ను టీజీపీఎస్సీ సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుర్రా వెంకటేశం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బుర్రా వెంకటేశం స్పందించారు… జాబ్ క్యాలెండర్ జాప్యం కావడంపై అధ్యయనం చేస్తామని, ఈ అంశంపై స్పష్టత తీసుకుంటామని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లో ఏమున్నాయో చూసి, రిజర్వేషన్ల వల్ల ఆగిందా..? లేక మరేమైన కారణాలున్నాయా..? అన్నది స్టడీ చేస్తామని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ కారణంగా జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం అమలు చేయడంలేదన్న వార్తలొచ్చాయి. దీంతోనే గత అక్టోబర్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కాలేదు.
18, 19న ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో భేటీ కానున్నట్టు పేర్కొన్నారు. జనవరిలో రాష్ట్రప్రభుత్వంతో భేటీ అయ్యి నివేదికను అందజేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత సంస్థాగత మార్పులు చేసి యూపీఎస్సీతో పోటీ పడేలా కమిషన్‌ను సిద్ధంచేస్తామని తెలిపారు.
అలాగే మార్చి నెలలో గ్రూప్ -1, 2, 3 పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. గ్రూప్ 1 పోస్టులను ముందు, తర్వాత గ్రూప్ – 2, చివరిగా గ్రూప్ – 3 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- INTER EXAMS – 7వ రోజు రిపోర్ట్
- Half Day School – పాఠశాలలకు ఒక్కపూట బడులు
- INTER EXAMS QP SET – 13th March 2025
- GK BITS IN TELUGU MARCH 13th