TGPSC – డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీలు

BIKKI NEWS (JUNE 22) : TGPSC DIVISIONAL ACCOUNT’S OFFICER EXAM DATES. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్ 2 పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క ఉద్యోగ పరీక్ష తేదీలను వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నోటిఫికేషన్ 2022లో విడుదల చేసింది

TGPSC DIVISIONAL ACCOUNT’S OFFICER EXAM DATES

జూన్ 30వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు ఈ పరీక్షలను రోజుకు రెండు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు.

ఉదయం సెషన్ 10.00 గంటల నుండి 12 : 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 : 30 నిమిషాల నుండి 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

మొత్తం 53 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలో మొదటి పేపర్ ను జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ అంశాలపై నిర్వహించనున్నారు. రెండో పేపర్ న అర్థమెటిక్ మరియు మెన్స్ రేషన్ అంశాలపై పదో తరగతి స్థాయిలో నిర్వహించనున్నారు. పరీక్ష పేపర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో ఉండనున్నాయి

ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జూన్ 25వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు గత మూడు నెలల లోపు దిగిన పాస్పోర్ట్ సైజు ఫోటోను హాల్ టికెట్ మీద సూచించిన ప్రదేశంలో గ్లూ తో అతికించాలి. అలాగే హాల్ టికెట్ లో పోటో కింద ఇవ్వబడిన సంతకం ప్రదేశంలో ఇన్విజిలేటర్ ముందు సంతకం చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి హాజరు కావాలంటే కచ్చితంగా హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకొని రావలసి ఉంటుంది.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు