Home > JOBS > TGPSC > TGPSC – ఏఈఈ అగ్రికల్చర్‌ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడి*

TGPSC – ఏఈఈ అగ్రికల్చర్‌ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడి*

BIKKI NEWS (JUNE 15) : ప్రభుత్వ విభాగాల్లో 1,540 సివిల్, మెకానికల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా అగ్రికల్చర్‌ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితాను (TGPSC AEE POSTS PROVISIONAL SELECTION LIST) తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం విడుదల చేసింది.

అగ్రికల్చర్‌ కేటగిరీలో మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. ఎంపిక జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్ లో పొందుపరిచామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

ఈ పరీక్ష ను మే – 09 – 2023 న నిర్వహించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ మార్చి – 18 – 2024 న చేపట్టారు.

ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయాల్సిన పోస్టీలలో 4 పోస్టులను అర్హులైన అభ్యర్థులు లేక భర్తీ చేయడం లేదని కమిషన్ తెలిపింది.

ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ లను అవసరాన్ని బట్టి సమర్పించాల్సి ఉంటుంది.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/

LATEST CURRENT AFFAIRS