Home > JOBS > TGPSC > TGPSC – అకౌంట్స్ ఆఫీసర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

TGPSC – అకౌంట్స్ ఆఫీసర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

BIKKI NEWS (JUNE 16) : TGPSC ACCOUNTS OFFICER CERTIFICATE VERIFICATION ON JUNE 18th. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు జూన్ 18న హైదరాబాద్ లోని నాంపల్లి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది.

ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో కలదు. వెబ్సైట్ లో పొందుపరిచిన అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలనూ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ కలిపి 78 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022, డిసెంబర్ 31న నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

LATEST JOB NOTIFICATIONS

FOLLOW US @TELEGRAM