లెక్చరర్స్ అసోసియేషన్ 475 నూతన కమిటీల ఎన్నిక

హనుమకొండ (ఆగస్టు – 20) : తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 (TGGLA 475) రాష్ట్ర స్థాయి సమావేశం న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హనుమకొండ నందు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ అధ్యక్షుతన నిర్వహించగా తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో కొప్పిశెట్టి సురేష్ నూతన అధ్యాపకుల సర్వీస్ సంబంధిత సమస్యలు వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గాలను గురించి అనేక అంశాలను తెలియజేయడం జరిగింది. అనంతరం వారి ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

★ వరంగల్ జిల్లా కమిటీ ఎన్నిక

అందులో భాగంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పాతూరి రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎల్ల స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీనివాస శర్మ, ట్రెజరర్ గా బుచ్చిరెడ్డి, మహిళా కార్యదర్శిగా శోభారాణి, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్, రంజిత్ శర్మ, నరేష్, శ్రీనివాస్, మహిళా జాయింట్ సెక్రటరీగా మమత, జాయింట్ సెక్రటరీలుగా డి. శ్రీనివాస్, నాగరాజు, లక్ష్మి, రజిత తదితరులను ఎన్నుకోవడం జరిగింది.

★ హనుమకొండ జిల్లా కమిటీ ఎన్నిక

హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ బూర విజయ మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజయ్ చందర్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా గణేష్, ట్రెజరర్ గా వేణు, మహిళా కార్యదర్శిగా శోభా దేవి, మహిళ జాయింట్ సెక్రటరీగా హిమబిందు, ఉపాధ్యక్షులుగా సునీల్, జాయింట్ సెక్రటరీలుగా సైదులు తదితరులను ఎన్నుకోవడం జరిగింది.

ఈ సమావేశంలో నూతనంగా ఎన్నుకోబడిన వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాతూరి రాజిరెడ్డి, బూర విజయ మోహన్, ఎల్లస్వామి, శ్రీనివాస్ లు మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ జిల్లాలలో ఉన్న నూతన గెజిటెడ్ అధ్యాపకుల సమస్యల సాధన కోసం తమ వంతుగా నిరంతరం కృషి చేస్తూ, సంఘ బలోపేతానికి మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని తెలియజేస్తూ ఈ జిల్లా కమిటీల ఎన్నికలకు సహకరించిన వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యాపక మిత్రులందరికీ అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిల్, సదాశివుడు, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, మహిళా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి సువర్ణ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.