నేటి నుంచి ఇంజనీరింగ్ సీట్ల స్లైడింగ్

BIKKI NEWS (AUG. 21) : TGEAPCET 2024 SLIDING OPTIONS. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్
కళాశాలల్లో ఆగస్టు 21 నుంచి అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ మొదలుకానుంది. దీన్ని ఈసారి సాంకేతిక విద్య విభాగం నిర్వహిస్తోంది. ప్రతీ ఏటా స్లైడింగ్ ను సంబంధిత కాలేజీలే నిర్వహించేవి.

TGEAPCET 2024 SLIDING OPTIONS

తుది దశ కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 5 వేల సీట్లు భర్తీ కాలేదు. సీట్లు కేటాయించినప్పటికీ దాదాపు 6,800 మంది విద్యార్థులు రిపోర్టు చేయలేదు. దీంతో 11,800 ఖాళీలు ఏర్పడ్డాయి.

స్లైడింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ను సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన మంగళవారం విడుదల చేశారు. కాలేజీల్లో ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులు, బ్రాంచీ మార్చుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

స్లైడింగ్ కు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 21, 22 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని, 24న సీట్లు కేటాయిస్తామని, 25 వరకూ అలాట్మెంట్ ఆర్డర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 25ధ సీటు వచ్చిన బ్రాంచీలో రిపోర్టు చేయాలని విద్యార్థులకు సూచించారు.

ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనే వివరాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.

వెబ్సైట్ : https://tgeapcet.nic.in/Default.aspx

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు