ICET 2024 – తుది విడుత సీట్ల కేటాయింపు

BIKKI NEWS (SEP. 24) : TG ICET 2024 FINAL PHASE SEATS ALLOTED. తెలంగాణ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించి టీజీ ఐసెట్ 2024 తుది విడుత సీట్ల కేటాయింపు పూర్త‌యింది.

TG ICET 2024 FINAL PHASE SEATS ALLOTED

ఈ ఏడాది ఎంసీఏ కోర్సుల్లో 87.5శాతం, ఎంబీఏలో 90.8 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తంగా 90.2 శాతం సీట్లు భ‌ర్తీ కావ‌డం విశేషం.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల‌కు క‌లిపి మొత్తం 35,311 సీట్లు ఉండ‌గా, 31,842 సీట్లు నిండాయి. ఇక 3,469 సీట్లు మాత్రమే మిగిలాయి. 99 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి.

సీట్లు పొందిన విద్యార్థులంతా సెప్టెంబర్ 27లోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని అధికారులు సూచించారు.

ఫీజు చెల్లించిన వారంతా ఈ నెల 28వ తేదీలోపు విద్యార్హ‌త సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించాల‌ని సూచించారు. లేని ప‌క్షంలో ఆటోమేటిక్‌గా సీటు క్యాన్షిల్ అవుతుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

వెబ్‌సైట్‌ : https://tgicet.nic.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు