BIKKI NEWS (APR. 29) : TG EAPCET 2025 EXAMS GUIDELINES. తెలంగాణ రాష్ట్ర ఎప్‌సెట్ 2025 పరీక్షలు నేటి నుండి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరగనున్నాయి.
TG EAPCET 2025 EXAMS GUIDELINES.
అగ్రికల్చర్-ఫార్మసీకి 87 వేల మంది, ఇంజినీరింగ్‌కు 2.20 లక్షల మంది దరఖాస్తు చేశారు.
విద్యార్థులకు ఈ పరీక్షలకు సంబంధించి కీలక నిబంధనలు విడుదల చేశారు.
- పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని ఎప్‌సెట్ కన్వీనర్ ఆచార్య బి.డీన్‌కుమార్, కో-కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
- ఉదయం విడత పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం విడత పరీక్ష 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.
- ఉదయం పరీక్షకు 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు.
- సాంకేతిక కారణాల వల్ల కంప్యూటర్ ఆగిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన సమయాన్ని కంప్యూటర్ ఆన్ అయిన తర్వాత కేటాయిస్తారని తెలిపారు.
- విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుని రావద్దని స్పష్టం చేశారు
- పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో నిర్వహించనున్నారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్