Home > JOBS > DSC (TRT) > TG DSC SPORTS QUOTA – మళ్లీ సర్టిఫికెట్ ల వెరిఫికేషన్

TG DSC SPORTS QUOTA – మళ్లీ సర్టిఫికెట్ ల వెరిఫికేషన్

BIKKI NEWS (NOV. 14) : TG DSC SPORTS QUOTA CERTIFICATE VERIFICATION. తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో స్పోర్ట్స్‌ కోటా పోస్టులకు అభ్యర్థులు సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ మళ్ళీ చేయనున్నారు.

TG DSC SPORTS QUOTA CERTIFICATE VERIFICATION

ఇందులో భాగంగా 393 మంది స్పో ర్ట్స్‌ కోటా అభ్యర్థులకు నవంబర్ 20 నుంచి 22 వరకు మరోసారి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ దోమల్‌గూడలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి సూచించారు.

అన్ని జిల్లాల్లో కలిపి 90 వరకు స్పోర్ట్స్‌ కోటా పోస్టులున్నాయి. జీవో-74 ప్రకారం అన్ని అర్హతలున్న 33 మందికి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలిచ్చారు. మిగిలిన పోస్టులను నాన్‌ స్పోర్ట్స్‌ కోటాలో జనరల్‌ అభ్యర్థులతో భర్తీ చేశారు.

ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు తమకు అన్ని రకాల అర్హతలున్నాయని, అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. కొంత మంది స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో అభ్యర్థులందరి సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.

పెద్దపల్లి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలు మినహా 31జిల్లాల్లోని పీఈటీ అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌ జిల్లాలో 20 మంది ఫలితాలు విత్‌హెల్డ్‌లో పెట్టారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు