Home > JOBS > DSC (TRT) > TG DSC Final Key: సెప్టెంబరు 2 లోగా డీఎస్సీ తుది కీ

TG DSC Final Key: సెప్టెంబరు 2 లోగా డీఎస్సీ తుది కీ

BIKKI NEWS (AUG. 28) : TG DSC FINAL KEY WILL RELEASE. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ కు సంభవించిన ఫైనల్ కీ సెప్టెంబరు 2 నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

TG DSC FINAL KEY WILL RELEASE

ఱప్రాథమిక కీ ని వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఈ నెలాఖరులోగా తుది కీ ఇవ్వాలని భావించారు. ఆలోగా వీలుకాకుంటే ఒకట్రెండు రోజులు ఆలస్యం కావచ్చని, మొత్తానికి సెప్టెంబరు 2 నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఆ తర్వాత డీఎస్సీ మార్కులకు… టెట్‌ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకు లిస్టు విడుదల చేస్తారు.

తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను వెల్లడిస్తారు.

డీఈఓలు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్‌ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీచేస్తారు.

క్రీడా కోటా కింద దరఖాస్తు చేసిన వారు సెప్టెంబరు 2 వరకు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న ఆధారాలతో కూడిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు