DSC 2025 – మరో డీఎస్సీ నోటిఫికేషన్ – ఖాళీలు ఇవే…

BIKKI NEWS (JULY 16) : TG DSC 2025 NOTIFICATION and VACANCIES. తెలంగాణ రాష్ట్రంలో 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత డీఎస్సీ ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని.., 5 వేలకుపైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించిన సంగతి తెలిసిందే.

TG DSC 2025 NOTIFICATION and VACANCIES

ఏటా రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరుపుతామని, వాటిని జూన్, డిసెంబరులో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం డిసెంబరులో టెట్ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినా 45 రోజుల గడువు తప్పనిసరి. అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్రంలో ఇటీవల 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. అందులో 10,449 మంది భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించినా పోస్టుల ఉన్నతీకరణ వల్ల కొత్త ఖాళీలు ఏర్పడవు. అంటే ఇక మిగిలినవి 9,268 ఖాళీలు మాత్రమే.

ప్రస్తుతం 1,739 ప్రాధమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేరు. వాటిని జీరో స్కూళ్లుగా పిలుస్తారు. వాటిల్లో దాదాపు 2,000 మంది టీచర్లు ఉంటారు. ఇలాంటి 32 ఉన్నత పాఠశాలల్లో 400 మంది ఉపాధ్యాయులున్నారు. 6, 7 తరగతుల్లో విద్యార్థులు లేని ప్రాథమికోన్నత పాఠశాలలు (యూపీఎస్) 600 ఉన్నాయి. వాటిల్లో 2,000 నుంచి 2,400 మంది వరకు ఉపాధ్యాయులున్నారు. ఆ మొత్తం 4,400 నుంచి 4,800 వరకు అవుతాయి.

వాటిని మినహాయిస్తే చివరకు 4,400 నుంచి 5,200 వరకు ఉపాధ్యాయ ఖాళీలుంటాయని విద్యా శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 200-300 మంది టీచర్లు పదవీ విరమణ పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు మొత్తం 1,25,058 ఉండగా.. పనిచేస్తున్నవారు 1.03 లక్షల మంది ఉన్నారు. ఈనెల 18న ప్రారంభమయ్యే డీఎస్సీ ద్వారా 11,062 మంది కొత్త టీచర్లు రానున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు