TG DSC 2024 – రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు

BIKKI NEWS (JULY 17) : TG DSC 2024 EXAMS and HALL. TICKETS. తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ నోటిఫికేషన్ 2024 కు సంబంధించిన రాత పరీక్షలు రేపటి నుంచి అనగా జులై 18 నుంచి ఆన్లైన్ పద్దతిలో ప్రారంభం కానున్నాయి.

మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్నాయి.

ఇప్పటికే 2,40,727 మంది తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు రెండు విడతల చొప్పున పరీక్షలు జరుగుతాయి.

హాల్ టికెట్లలో తప్పులు దొర్లాయని పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. వాటిని సరి చేసి ఆన్లైన్ లో ఉంచుతామని అధికారులు తెలిపారు.

అలాగే ఒకేరోజు రెండు సెషన్స్ లో పరీక్షలు రాసి అభ్యర్థులకు ఒకే కేంద్రంలో పరీక్షలు రాసేందుకు అనుమతిస్తూ సంబంధిత అభ్యర్థులకు నూతన హాల్ టికెట్లను కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ముఖ్యంగా నాన్ లోకల్ కేటగిరీలో పరీక్షలు రాసే అభ్యర్థులకు ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. కానీ ప్రభుత్వం కచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది.

DSC 2024 HALL TICKETS DOWNLOAD LINK

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు