DSC 2024 – టెట్ మార్కుల అప్లోడ్ కు అవకాశం

BIKKI NEWS (SEP. 11) : TET MARKS UPLOAD OPTION IN TELANGANA DSC 2024. డీఎస్సీ ఫలితాల విడుదలకు ముందే టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. . ఇందుకు సెప్టెంబర్ 12, 13వ తేదీలలో రెండు రోజుల పాటు అవకాశం కల్పించింది. అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు.

TET MARKS UPLOAD OPTION IN TELANGANA DSC 2024

డీఎస్సీ ఫైనల్ ‘కీ’ని ఇప్పటికే విడుదల చేశారు. ఫైనల్ ‘కీ’పైనా అభ్యర్థులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆయా అభ్యంతరాలను రివ్యూ కమిటీ పరిశీలనకు పంపించారు. కమిటీ పరిశీలన పూర్తైన తర్వాత రివైజ్డ్ ఫైనల్ ‘కీ’ని విద్యాశాఖ విడుదల చేయనుంది. ఆ తర్వాత టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను విడుదల చేస్తారు.

దీంట్లో భాగంగానే టెట్ మార్కులను మరోసారి అప్లోడ్ చేసుకునే అవకాశమివ్వాలని అధికారులు నిర్ణయించారు.

TG DSC 2024 – TET MARKS UPLOAD OPTION LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు