Home > EDUCATION > TS TET > TET EXAMS : వేరే జిల్లాలో పరీక్ష కేంద్రాలు

TET EXAMS : వేరే జిల్లాలో పరీక్ష కేంద్రాలు

BIKKI NEWS (DEC. 28) : TET exam centers in other districts. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 రాత పరీక్షలకు అభ్యర్థులకు వేరే జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు పడడంతో అభ్యర్థులు వాపోతున్నారు.

TET exam centers in other districts

కనీసం ఉమ్మడి జిల్లాలో కూడా కాకుండా సుదూర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు పడిన అభ్యర్థులు వేల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం.

ఈసారి పరీక్ష కేంద్రాల ఎంపిక ఆప్షన్ కు 16 కేంద్రాలు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని అభ్యర్థులు తెలుపుతున్నారు. గతంలో కూడా ఇలానే సుదూర జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఇవ్వడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈసారైనా ఉమ్మడి జిల్లాలో లేదా దగ్గరి జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారనుకుంటే సుదూర జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారని అభ్యర్థులు తెలిపారు.

జనవరి 2 నుండి 20వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో పది రోజులపాటు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేయగా… జనవరి 11 మరియు 20వ తేదీల్లో నిర్వహించే పరీక్షలకు ఈరోజు హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు. పరీక్షకు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రం గేట్స్ మూసివేయనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు