BIKKI NEWS (JUNE 17) : TET EXAM 2025 GUIDELINES. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన కీలకమైన నిబంధనలను కన్వీనర్ విడుదల చేశారు.
TET EXAM 2025 GUIDELINES
టెట్ రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో జూన్ 18తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సెషన్ – 1 ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సెషన్ -2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పేపర్-1 పరీక్షలను జూన్ 20, 23, 24 తేదీల్లో రెండో షిప్ట్ లో మరియు జూన్ 27 రెండు షిప్ట్ లలో నిర్వహించనున్నారు.
పేపర్ -2 పరీక్షలను జూన్ 18, 19, 24 తేదీల్లో మొదటి షిప్ట్ లో మరియు జూన్ 28, 29, 30వ తేదీలలో రెండు షిప్ట్ లలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు(ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ) తీసుకెళ్లాలి.
ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యే వారిని మ. 12.30 గంటల నుంచి అనుమతించనున్నారు.
ఇక పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లను క్లోజ్ చేయనున్నారు. అంటే ఉదయం సెషన్‌లో ఉ. 8.45కు, మధ్యాహ్నం సెషన్‌లో 1.45 గంటలకు గేట్లను మూసివేయనున్నారు.
స్మార్ట్ వాచీలతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్