పోటీ పరీక్షలకు ఏ పుస్తకాలు ప్రామాణికం.?!

BIKKI NEWS (OCT. 11) : telugu akademi books are not reference says TGPSC. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా హైకోర్టులో తెలుగు అకాడమీ పుస్తకాలు తమకు ప్రామాణికం కాదని నిపుణుల కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

telugu akademi books are not reference says TGPSC

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష కీ పై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అకాడమీ బుక్స్ ప్రకారం కీ ని సవరించాలని కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో… టీజీపీఎస్సీ ఈ అపిడవిట్ ను హైకోర్టులో దాఖలు చేసింది. అఫిడవిట్ లో తెలుగు అకాడమీ పుస్తకాలలో రిఫరెన్స్ లేవని, రీసెర్చ్ వర్క్ చేయలేదని కావున నిపుణుల కమిటీదే తుది నిర్ణయం అని పేర్కొంది.

ఈ నేపథ్యంలో హైకోర్టు వాదనలను అక్టోబర్ 18 వ తేదీకి వాయిదా వేసింది.

దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థుల్లో పెద్ద గందరగోళం ఏర్పడింది. ఏ బుక్స్ ను ప్రామాణికంగా తీసుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వలనే దానిపై సందిగ్ధత ఏర్పడింది.

తాజాగా దీనిపై తెలుగు అకాడమీ వర్గాలు టీజీపీఎస్సీతో సంప్రదించి కావాల్సిన మార్పులు చేర్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు