Home > EDUCATION > TS TET > టెట్ వాయిదాకు కారణాలు ఇవే…

టెట్ వాయిదాకు కారణాలు ఇవే…

BIKKI NEWS (NOV. 06) : Telangana TET postponed due to fee clarification. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024 రెండో సెషన్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. తిరిగి దరఖాస్తులను నవంబర్ 7వ తేదీ నుండి స్వీకరించనున్ధట్లు విద్యా ప్రకటించింది.

Telangana TET postponed due to fee clarification

ఈ ప్రక్రియ మంగళవారం నుంచే మొదలవుతుందని పాఠశాల విద్యాశాఖ సోమవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. సాంకేతిక కారణాలతో రెండు రోజులపాటు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

టెట్ వాయిదాకు కారణాలు ఇవే

టెట్ ఫీజును తగ్గిస్తామని గత పరీక్షకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

అలాగే గత టెట్ లో అర్హత సాధించని వారికి ఈసారి దరఖాస్తు ఫీజు లేకుండా పరీక్ష రాసే అవకాశం కల్పించాల్సి ఉంది.

ఆ రెండు అంశాలపైనా ప్రభుత్వం నుంచి ఇంకా నిర్ణయం వెలువడకపోవడమే వాయిదాకు కారణమని తెలుస్తోంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు