Home > EDUCATION > TS TET > TET FEE – తగ్గిన టెట్ ఫీజు, వారికి ఫీజు లేదు

TET FEE – తగ్గిన టెట్ ఫీజు, వారికి ఫీజు లేదు

BIKKI NEWS (NOV. 07) : Telangana TET 2024 Fees. తెలంగాణ రాష్ట్ర టెట్ 2024 ఫీజు ను విద్యాశాఖ తగ్గించింది. అలాగే గత 2024 మే / జూన్ టెట్ దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు లేదు.

Telangana TET 2024 Fees.

గతంలో ఒక్క పేపర్ కు 1,000/- రూపాయలు, రెండు పేపర్లకు 2,000/- రూపాయలు గా వసూళ్లు చేసిన ఫీజు ను ప్రస్తుత నోటిఫికేషన్ లో తగ్గించారు.

ప్రస్తుత టెట్ నోటిఫికేషన్ లో ఒక్క పేపర్ కు 750/- రూపాయలు, రెండు పేపర్లకు 1,000/- రూపాయలు గా నిర్ణయించారు.

వారికి ఫీజు మినహాయింపు

అలాగే 2024 మేలో నిర్వహించిన టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకుని హాజరై అర్హత సాధించని అభ్యర్థులు మరియు అర్హత సాధించినప్పటికీ మార్కుల పెరుగుదల కోసం మరోసారి టెట్ రాసే అభ్యర్థులకు ఈసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు