యూనివర్సిటీగా సాంకేతిక విద్యాశాఖ – ఇంజనీరింగ్ కళాశాలలుగా పాలిటెక్నిక్ లు

BIKKI NEWS (SEP. 13) : Telangana Technical University instead of SBTET. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి స్థానంలో తెలంగాణ సాంకేతిక విశ్వవిద్యాలయం రానుంది. పాలిటెక్నిక్ కళాశాలల పర్యవేక్షణకు నెలకొల్పిన సాంకేతిక విద్యామండలిని పూర్తి స్థాయిలో యూనివర్సిటీగా మార్చాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

Telangana Technical University instead of SBTET

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజినీరింగ్ కళాశాలలుగా ఉన్నతీకరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా వాటికి విశ్వవిద్యాలయం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 173 ఇంజినీరింగ్ కళాశాలలున్నా వాటిల్లో 140 వరకు జేఎన్టీయూహెచ్, మరో 15 ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ విద్యా సంవత్సరమే (2024-25) వికారాబాద్ జిల్లాలోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజిగా మార్చింది. తాజాగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మరో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను కూడా ఇంజినీరింగ్ కళాశాలలుగా మార్చాలని నిర్ణయించారు. అవన్నీ 2025-26వ విద్యా సంవత్సరం అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని 57 ప్రభుత్వ ప్రభుత్వ, 57 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుతం ఎస్బీటెట్ పర్యవేక్షిస్తోంది. ఇంజినీరింగ్ కళాశాలలకు ఆ బోర్డు అఫిలియేషన్ ఇవ్వడానికి వీలుకాదు. అందుకే దాన్ని యూనివర్సిటీగా మారిస్తే భవిష్యత్తులో ఎన్ని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలొచ్చినా సమస్య ఉండదని ప్రభుత్వ ఆలోచన.

జేఎన్టీయూహెచ్ కింద 140 వరకు ఇంజినీరింగ్ కళాశాలలు, మరో 80 వరకు ఫార్మసీ, మరో 94 మేనేజ్మెంట్ కళాశాలలతో పాటు యూనివర్సిటీ కళాశాలలు మరో 8 ఉన్నాయి. మరిన్ని కాలేజీలు వస్తే దానిపై భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే గుజరాత్ లో టెక్నికల్ యూనివర్సిటీ (జీటీయూ) పనిచేస్తోంది. అదే తరహాలో ఇక్కడా సాంకేతిక విద్యామండలిని తెలంగాణ టెక్నికల్ యూనివర్సిటీ (టీటీయూ)గా మార్చాలన్నది ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు