DEPARTMENTAL TESTS : నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (సెప్టెంబర్ – 01) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 2023 నవంబర్ సెషన్ కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకై డిపార్ట్మెంటల్ టెస్ట్ లకు (Departmental Tests 2023) సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ రెండవ తేదీన విడుదల కానుంది.

ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నవంబర్ 17 నుండి 25వ తేదీ మధ్య నిర్వహించనున్నారు.

పరీక్షకు దరఖాస్తు గడుగు సెప్టెంబర్ 8 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు కలదు.

పరీక్షలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు హైదరాబాద్ సహా 9 జిల్లా కేంద్రాలలో నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/