- కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి
BIKKI NEWS (SEP. 09) : Telangana language day in GJC Dharmakancha. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకoచ, జనగామ నందు తెలంగాణా వైతలీకుడు, ప్రజల పక్షం వహించిన ప్రజాకవి, రచయిత, ఉద్యమకారుడు, పద్మవిభూషణ్ కాళోజి నారాయణ జయంతి మరియు తెలంగాణ భాష దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
Telangana language day in GJC Dharmakancha
ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి కళాశాల అధ్యాపకులు కాళోజి స్ఫూర్తి ని కొనసాగించేందుకు కృషి చేయాలన్నారు. నేటి విద్యార్థులు చైతన్య శిలూరుగా, జీవిత గమనం పొందాలని సుంచిశారు. తెలంగాణా ఆవిర్భావo తరువాత అతని పేరు మీద కాళోజి హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం అన్నారు. ప్రాంతేతరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానుభావుడు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు అధ్యాపకులు వెంకటేష్ ని సన్మానం చేశారు.
వ్యాస రచన మరియు వ్యక్తిత్య పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.