BIKKI NEWS (NOV. 19) : Telangana job notifications after january 2025. తెలంగాణలో నూతన జాబ్ ఉద్యోగ నోటిఫికేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఎస్సీ, ఎస్టీ ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల వాయిదా పడింది.
Telangana job notifications after january 2025.
జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ పై ఏక సభ్య కమిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు జనవరి 11 – 2025 వరకు గడువు పెట్టింది. ఆలోపల నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నివేదిక ఆధారంగానే ఉద్యోగ నియామకాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు కేటాయింపు చేయనున్నారు.
సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పై సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 24న మూడు నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది. అవి ట్రాన్స్‌కో,0 ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్,0 రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం,అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వంటి నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ పై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక తర్వాతే ఈ నోటిఫికేషన్లు కూడా వెలవడనున్నాయి. దీంతో దాదాపుగా జనవరి 2025 తర్వాతనే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.